- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Vintara Saradaga : మహేష్ మేనల్లుడి మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్..కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో అదిరిపోయాడంతే..
‘హీరో’(Hero) మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన గల్లా అశోక్(Galla Ashok) మనందరికీ సుపరిచితమే.

దిశ, వెబ్‌డెస్క్: ‘హీరో’(Hero) మూవీతో టాలీవుడ్‌లో అడుగుపెట్టిన గల్లా అశోక్(Galla Ashok) మనందరికీ సుపరిచితమే. ఈ యంగ్ హీరో మహేశ్‌బాబు(Mahesh Babu)కు మేనల్లుడు. అయితే ప్రస్తుతం అశోక్ యంగ్ డైరెక్టర్ ఉద్భవ్ డైరెక్షన్‌లో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఇక సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్‌లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అలాగే శ్రీ గౌరీ ప్రియ, రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్‌లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
అయితే తాజాగా ఈ చిత్రానికి ‘వీసా- వింటారా సరదాగా’ అనే టైటిల్‌ను ఖరారు చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో అశోక్ గల్లా కూల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపిస్తున్నాడు. కాగా ఈ చిత్ర టీజర్‌ను శనివారం ఉదయం 10.53 గంటలకు విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది. Link






