ఈ రాక్షసుడితో జాగ్రత్త..

by Sujitha Rachapalli |

డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ కార్తీక్ రాజు తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వినూత్నమైన కథాంశంతో యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో ‘విలయ తాండవం’ అనే చిత్రం

ఈ రాక్షసుడితో జాగ్రత్త..
X

దిశ, సినిమా : డిఫరెంట్ స్టోరీ, కంటెంట్ ఉన్న సబ్జెక్ట్‌లను ఎంచుకుంటూ కార్తీక్ రాజు తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఓ వినూత్నమైన కథాంశంతో యంగ్ టాలెంటెడ్ కార్తీక్ రాజు, పార్వతి అరుణ్, పుష్ప ఫేమ్ జగదీష్ ప్రధాన పాత్రల్లో ‘విలయ తాండవం’ అనే చిత్రం రాబోతోంది. జీఎంఆర్ మూవీ మేకర్స్ బ్యానర్ మీద ప్రొడక్షన్ నెంబర్ 1గా మందల ధర్మా రావు, గుంపు భాస్కర రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వీఎస్ వాసు దర్శకత్వం వహిస్తున్న సినిమా నుంచి తాజాగా క్రిస్మస్ స్పెషల్‌గా ఓ పవర్ ఫుల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ పోస్టర్‌ను చూస్తుంటే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండేట్టుగానే కనిపిస్తుంది. చుట్టూ ఉన్న మంటలు, ఆ మంటల్లో కాలిపోతున్న వస్తువులు, కింద పడిపోయి ఉన్న ఫోటో ఫ్రేమ్, హీరో చేతి మీద అగ్ని జ్వాలలు, తలకి కట్టు, ఆయన హావభావాలు చూస్తుంటే ఇంటెన్స్ కారెక్టర్‌ను పోషిస్తున్నట్టుగా కనిపిస్తోంది. ఈ మూవీని పాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేసేందుకు మేకర్లు సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా ఈ మూవీ షూటింగ్‌ జరుగుతోంది. ఇక ‘విలయ తాండవం’కు సురేష్ రగుతు సినిమాటోగ్రఫర్‌గా, జ్ఞాని మ్యూజిక్ డైరెక్టర్‌గా, వంశీ కృష్ణ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ మూవీని రిలీజ్ చేయబోతోన్నారు.

Next Story