- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రీ రిలీజ్‌కు రెడీ అయిన తేరి.. ఆ రెండు చిత్రాల మాదిరి ఇంపాక్ట్ చూపుతుందా
తలపతి విజయ్ హీరోగా రూపొందిన తేరి మూవీని ఫిబ్రవరి 27వ తేదీన విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

దిశ, వెబ్ డెస్క్ : తమిళ స్టార్ హీరోలలో ఒకరైన తలపతి విజయ్ 2016వ సంవత్సరం తేరి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇందులో సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటించగా అట్లీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు. వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్. థాను నిర్మించిన ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ సంగీతం అందించాడు. భారీ అంచనాల నడుమ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాను తెలుగులో పోలీసోడు అనే పేరుతో విడుదల చేశారు. తెలుగులో కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తాజాగా తేరి రీ రిలీజ్ కి సంబంధించిన అప్డేట్ను ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది.
ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ని ఫిబ్రవరి 27వ తేదీన రీ రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే విజయ్ నటించిన గిల్లి, సచిన్ మూవీలు రీ రిలీజ్ అయ్యి కలెక్షన్ల పరంగా అనేక కొత్త రికార్డులను సృష్టించాయి. దానితో తేరి కూడా అదే రేంజ్ ఇంపాక్ట్ ను చూపిస్తుందని విజయ్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. మరి తేరి ఏ రేంజ్ కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుందో తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే. విజయ్ రీ రిలీజ్ మూవీల విషయం కాసేపు పక్కన పెడితే... తాజాగా ఈయన జన నాయగన్ అనే సినిమాలో నటించాడు. దీన్ని ఈ సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల లాస్ట్ మినిట్లో ఈ సినిమా విడుదల రద్దయింది. ఇప్పటివరకు ఈ చిత్ర విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడలేదు.






