OTT: ఓటీటీలోకి కింగ్‌డమ్.. నిప్పుల రాజ్యంలో కొత్త రాజు అంటూ పోస్టర్ రిలీజ్

by Chukka Sudharani |   (  Updated:2025-08-25 14:55:39  IST  )

రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి.

OTT: ఓటీటీలోకి కింగ్‌డమ్.. నిప్పుల రాజ్యంలో కొత్త రాజు అంటూ పోస్టర్ రిలీజ్
X

దిశ, సినిమా: రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన ‘కింగ్‌డమ్’ ఓటీటీ రిలీజ్‌కు సంబంధించి గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. తాజాగా వీటిపై క్లారిటీ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ‘కింగ్‌డమ్’ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫిక్స్ సొంతం చేసుకోగా.. ‘బంగారం, రక్తంతో నిండిన నిప్పుల రాజ్యంలో.. బూడిద నుండి కొత్త రాజు లేస్తాడు.. కింగ్‌డమ్ మూవీ ఆగస్టు 27 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంలో అండ్ హిందీలో అందుబాటులోకి రానుంది’ అంటూ తెలిపింది.

కాగా.. అన్నాతమ్ముళ్ల సెంటిమెంట్ డ్రామాగా తెరపై మెరిసిన ఈ మూవీకి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించాడు. యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించింది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాపై బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం జులై 31న రిలీజై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

Next Story