ముగిసిన విజయ్ దేవరకొండ ఈడీ విచారణ.. 4 గంటలు పాటు

by velandi.Saikiran |   (  Updated:2025-08-06 10:20:12  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda) ఈడి విచారణ ( ED interrogation) కాసేపటి క్రితమే ముగిసింది. బెట్టిం

ముగిసిన విజయ్ దేవరకొండ ఈడీ విచారణ.. 4 గంటలు పాటు
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ( Vijay Deverakonda) ఈడి విచారణ ( ED interrogation) కాసేపటి క్రితమే ముగిసింది. బెట్టింగ్ యాప్ కేసులో ( Betting App Case) భాగంగా.. ఇవాళ ఉదయం ఈడీ విచారణను ఎదుర్కొన్నారు హీరో విజయ్ దేవరకొండ. పోలీసులు ఇచ్చిన నోటీసుల ప్రకారమే... విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ను దాదాపు నాలుగు గంటల పాటు విచారించింది ED బృందం.

బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కేసులో కోట్ల రూపాయలు తారుమారు అయ్యాయని అధికారులు చెబుతున్నారు. దీంతో ప్రమోషన్ చేసిన వారికి నిర్వాహకులు భారీగా డబ్బులు ఇచ్చినట్లు ఈడి అధికారులు గుర్తించారు. ఇక ఇవాళ్టి విచారణ సందర్భంగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ ప్రముఖ బ్యాంక్ స్టేట్మెంట్ కూడా అధికారులు పరిశీలించినట్లు తెలుస్తోంది. అంతేకాదు ఆయన ఆర్థిక లావాదేవీలు, మనీలాండరింగ్ కోణాల్లో కూడా విచారించారట. అవసరమైతే మరోసారి విచారణకు వస్తానని అధికారులకు విజయ్ దేవరకొండ స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. ఈ విచారణపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Next Story