- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెత్త కుప్పలో నల్లటి డెడ్ బాడీ.. భయంకరంగా మార్గన్ ఎంట్రీ
విజయ్ ఆంటోని(Vijay Antony) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్గన్’(Maargan).

దిశ, సినిమా: విజయ్ ఆంటోని(Vijay Antony) నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మార్గన్’(Maargan). మర్డర్ మిస్టరీ అండ్ క్రైమ్ థ్రిల్లర్ (Crime thriller Movie) బ్యాక్ డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి లియో జాన్ పాల్ (Director Leo John Paul) దర్శకత్వం వహిస్తున్నాడు. తాజాగా ఈ చిత్రం నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు చిత్ర బృందం. ఇక ట్రైలర్ గమనించినట్లయితే.. స్టార్టింగ్ స్టార్టింగ్‌లోనే.. ఒక అమ్మాయిని పోలీసులు కాపాడేందుకు ఆమెను ఫాలో అవుతారు. ఇక అదే టైమ్‌లో.. కిల్లర్ (Killer)ఆమెను ఎత్తుకెళ్లి చంపేస్తాడు. అయితే.. చనిపోయిన అమ్మాయి బాడీ నల్లగా మారిపోయి చెత్త కుప్పలో పడి ఉంటుంది. అందరూ దాన్ని చూసి షాక్ అవ్వగా.. స్పెషల్ డ్రగ్ డోస్ ఇంజెక్ట్ చేయడం వల్ల ఇలా జరిగిందని ల్యాబ్ రిపోర్ట్స్ వస్తాయి. ఇక ఆ తర్వాత ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా విజయ్ ఆంటోని ఎంట్రీ ఉంటుంది. అసలు ఆ స్పెషల్ డ్రగ్ ఏంటీ..? అమ్మాయిలను ఎందుకు కిడ్నాప్ చేస్తున్నారనేది సినిమా స్టోరీ. మొత్తంగా ఈ ట్రైలర్ క్రైమ్ అండ్ థ్రిల్లింగ్ అంశాలతో భయంకరంగా ఆకట్టుకుంటోంది. కాగా.. ఈ చిత్రాన్ని విజయ్ ఆంటోని ఫిలిమ్స్ కార్పొరేషన్(Vijay Antony Films Corporation)పై నిర్మిస్తుండగా.. మీరా విజయ్ ఆంటోని సమర్పిస్తున్నారు.






