Vidya Balan: హీరోయిన్స్ అవకాశాలను బట్టి తమను తాము మార్చుకోవాలి.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |

బాలీవుడ్ (Bollywood) నటి విద్యా బాలన్ (Vidya Balan).. 2019లో వచ్చిన ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Vidya Balan: హీరోయిన్స్ అవకాశాలను బట్టి తమను తాము మార్చుకోవాలి.. స్టార్ నటి షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: బాలీవుడ్ (Bollywood) నటి విద్యా బాలన్ (Vidya Balan).. 2019లో వచ్చిన ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం ఈమె.. బాలీవుడ్‌తో పాటు తెలుగులో కూడా మూవీస్ చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం సుధీర్ బాబు ‘జటాధర’ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విద్యా బాలన్ సినిమా అవకాశాలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ‘మూవీ ఇండస్ట్రీలో మార్పులు సహజం. కాలానుగుణంగా నటీనటులు కూడా మారాలి. ముఖ్యంగా హీరోయిన్లు అవకాశాలను బట్టి తమను తాము కొత్తగా ఆవిష్కరించుకుంటూ ఉండాలి. అప్పుడే వారు దీర్ఘకాలం ఇండస్ట్రీలో రాణించగలుగుతారు. లేకపోతే అభిమానులకు దూరం కావడంతో పాటు.. ఫేడవుట్‌ అవుతారు’ అంటూ చెప్పుకొచ్చింది.

Next Story