బలగం వేణు దర్శకత్వంలో దేవిశ్రీ.. ఆ రోజే గ్లింప్స్ విడుదల

by Ajay Maddhiboyina |

బలగం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వేణు. అప్పటి వరకు కమెడియన్ గా ఉన్న వేణు బలగంతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు.

బలగం వేణు దర్శకత్వంలో దేవిశ్రీ.. ఆ రోజే గ్లింప్స్ విడుదల
X

దిశ, వెబ్ డెస్క్: బలగం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన దర్శకుడు వేణు. అప్పటి వరకు కమెడియన్ గా ఉన్న వేణు బలగంతో దర్శకుడిగా పరిచయమై మొదటి సినిమాతోనే హిట్ కొట్టాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ చిత్రాన్ని తెలంగాణ ప్రజలు ఎంతగానో ఆదరించారు. పల్లెల్లో స్క్రీన్లు పెట్టి మరీ ఈ సినిమాను వీక్షించారు. ఈ సినిమా తరవాత వేణు ఎలాంటి సినిమా తీయబోతున్నాడు అని యావత్ టాలీవుడ్ ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో వేణు తదుపరి సినిమా ఎల్లమ్మ అని జోరుగా ప్రచారం జరిగింది. అంతే కాకుండా సినిమాలో నాని హీరోగా నటిస్తున్నాడని సైతం ప్రచారం జరిగింది.

ఆ తరవాత నాని తప్పుకున్నాడని నితిన్ చేస్తున్నాడని కూడా టాక్ వినిపించింది. ఇలా చాలా మంది పేర్లు వినిపించాయి. కానీ హీరో ఎవరు అనేదానిపై స్పష్టత రాలేదు. కాగా తాజాగా ఈ సినిమాపై వేణు అప్డేట్ ఇచ్చాడు. సంక్రాంతి సందర్భంగా జనవరి 15న సినిమా గ్లింప్స్ విడుదల చేస్తానని ప్రకటించాడు. ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లోనే చేస్తున్నట్టు స్పష్టం చేశాడు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం అవుతుందని చెప్పాడు. దీంతో వేణు నెక్స్ట్ సినిమాపై క్లారిటీ వచ్చేసింది. ఇక తాజాగా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా నటించబోతున్నాడు.

Next Story