- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మళ్లీ ‘పెళ్లి చేసుకుందాం’ అంటున్న వెంకీ మామ
విక్టరీ వెంకటేష్ నటించగా అసాధారణ విజయం సాధించిన చిత్రాల్లో "పెళ్ళి చేసుకుందాం" ఒకటి. అందం - అభినయాల కలబోత సౌందర్య హీరోయిన్ గా సుప్రసిద్ధ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని సి.వెంకట్రాజు - శివరాజు సంయుక్తంగా నిర్మించారు.

దిశ, సినిమా : విక్టరీ వెంకటేష్ నటించగా అసాధారణ విజయం సాధించిన చిత్రాల్లో "పెళ్ళి చేసుకుందాం" ఒకటి. అందం - అభినయాల కలబోత సౌందర్య హీరోయిన్ గా సుప్రసిద్ధ దర్శకులు ముత్యాల సుబ్బయ్య తెరకెక్కించిన ఈ ట్రెండ్ సెట్టింగ్ చిత్రాన్ని సి.వెంకట్రాజు - శివరాజు సంయుక్తంగా నిర్మించారు. పోసాని కృష్ణమురళి సంభాషణలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. కాగా ఈ చిత్రాన్ని సాయిలక్ష్మీ ఫిలిమ్స్ పతాకంపై వరప్రసాద్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 4Kలో భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..."సంక్రాంతికి వస్తున్నాం" చిత్రంతో తెలుగులో 300 కోట్ల క్లబ్బు ఫౌండర్ హీరోగా చరిత్ర సృష్టించిన వెంకటేష్ నటించిన ఆణిముత్యాల్లో ఒకటైన "పెళ్ళి చేసుకుందాం" చిత్రాన్ని 4K రిజల్యూషన్ లో డిసెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు ఫ్రెష్ గా తీసుకువచ్చే అవకాశం లభించడం గర్వంగా ఉంది. మన రెండు రాష్ట్రాల్లో ఉన్న విక్టరీ ఫ్యాన్స్‌తోపాటు... సినీ ప్రేమికులంతా "పెళ్ళి చేసుకుందాం" చిత్రాన్ని ఆదరిస్తారనే నమ్మకం ఉంది. మూడేళ్లపాటు ఈ చిత్రం హక్కుల్ని మేము కలిగి ఉన్నాం" అని తెలిపారు. లైలా, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ కె.రవీంద్రబాబు, ఎడిటర్ గౌతంరాజు కాగా మ్యూజిక్ కోటి అందించారు.






