- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Veera Bhadrudu: సూర్య కొత్త సినిమా ట్రైలర్..గూస్ బంప్స్ రావాల్సిందే
సూర్య కొత్త సినిమా వీర భద్రుడు సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.

దిశ, వెబ్ డెస్క్: తమిళ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో డిఫరెంట్ కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే సూర్యకు తెలుగులో మంచి పాపులారిటీ ఉంది. ఆయన ఏ సినిమా చేసినా, తెలుగులోనూ రిలీజ్ అవుతుంది. అయితే అలాంటి సూర్య ఇప్పుడు మరో కొత్త సినిమా వీరభద్రుడుతో రాబోతున్నాడు. ఈ మూవీలో హీరోగా సూర్య చేస్తుండగా త్రిష హీరోయిన్.
ఆర్జే బాలాజీ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా మే 14వ తేదీన రిలీజ్ కానుంది. తమిళంలో కరుప్పు పేరుతో రిలీజ్ కానున్న ఈ సినిమా ట్రైలర్ తాజాగా రిలీజ్ చేశారు. యాక్షన్, కామెడీతో ఈ ట్రైలర్ అదిరిపోయింది. రెండు విభిన్న కోణాల్లో సాగే పాత్రలో సూర్య అలరిస్తారని ట్రైలర్ చూస్తేనే అర్థం అవుతోంది. లాయర్ ముసుగులో నేరాలు చేసే విలన్ బేబీ కృష్ణను ఎదుర్కొని.. సామాన్యులకు సూర్య ఎలా న్యాయం చేస్తాడు ? అనేది ఈ సినిమా కథ. అటు దాదాపు 20 సంవత్సరాల తర్వాత సూర్య, త్రిష జంటగా నటిస్తున్నారు.






