- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
‘అందరికీ సమాధానం చెప్పలేకపోతే క్షమించండి’: Varun Dhawan
బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అనేక హిందీ చిత్రాల్లో నటిస్తూ.. తన సత్తా చాటుతున్నాడు. బాలీవుడ్‌లో అత్యధిక పారితోషితం అందుకుంటోన్న హీరోల్లో వరుణ్ ధావణ్ ఒకరు. ఈ హీరో 2010 లలో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో చోటు సంపాదించారు కూడా. టీన్ డ్రామా స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్‌తో వరు్ ధావన్ సినీ ఇండస్ట్రీకి పరిచయ అయ్యారు.
వీటితో పాటు రొమాంటిక్ కామెడీలు మై తేరా హీరో, హంప్టీ శర్మ కీ దుల్హానియా, బద్రీనాథ్ కీ దుల్హానియా, యాక్షన్ కామెడీలు దిల్ వాలే, డిషూమ్, జుడ్వా 2, డ్యాన్స్ ఫిల్మ్ ఎబిసిడి 2, డ్రామా సుయి ధాగాలలో ప్రధాన పాత్రలలో నటించి మెప్పించాడు. దర్శకుడు శ్రీరామ్ రాఘవన్ నిర్మించిన క్రైమ్ థ్రిల్లర్ బద్లాపూర్‌లో ధావన్ తన భార్య అలాగే కొడుకు హత్యకు 15 సంవత్సరాల పాటు ప్రతీకారం తీర్చుకునే తండ్రి రఘు పాత్రను పోషించాడు. వరుణ్ ధావన్ నటనకు ఉత్తమ నటుడిగా ఫిల్మ్ ఫేర్ అవార్డును అందుకున్నాడు.
చివరగా బేబీ జాన్ చిత్రంలో నటించారు. ఈ మూవీకి కలీస్ దర్శకత్వం వహించారు. 2024 భారతీయ హిందీ భాష యాక్షన్ థ్రిల్లర్ చిత్రంలో కీర్తి సురేష్ కథానాయికగా నటించింది. ఇకపోతే రీసెంట్‌గా వరుణ్ ధావన్ పుట్టిన రోజును గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా చాలా మంది సోషల్ మీడియా వేదికన శుభాకాంక్షలు తెలిపారు. కాగా వరుణ్ అందరికీ స్పందించకపోయానని ఫ్యాన్స్ ను క్షమాపణ అడిగారు. ‘‘పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ ధన్యవాదాలు. నేను అందరికీ సమాధానం చెప్పలేకపోతే క్షమించండి. నా పుట్టినరోజును పనిలో గడపడానికి సరిపోయింది’’ అని రాసుకొచ్చారు.






