- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుమార్తెను ఒళ్లో కూర్చోబెట్టుకుని మ్యాచ్ చూస్తోన్న వరుణ్.. క్యూట్ పిక్ వైరల్
బాలీవుడ్ అగ్ర హీరో వరుణ్ ధావణ్ గురించి పత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు.

దిశ, వెబ్‌డెస్క్: బాలీవుడ్ అగ్ర హీరో వరుణ్ ధావణ్ గురించి పత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అనేక చిత్రాల్లో నటించి.. ఎంతో మంది అభిమానుల మనసుల్లో చోటు దక్కించుకున్నాడు. స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రంతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చాడు. వరుణ్ ఈ మూవీకి ఫిలిం ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ నామినేషన్ పొందాడు. తర్వాత ఈ నటుడు హంప్టీ శర్మాకీ దుల్హనియా, ఎబిసిడి2, వంటి చిత్రాల్లో నటించాడు. శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన బద్లాపూర్ సినిమాకు వరుణ్ కు ఫిలిం ఫేర్ ఉత్తమ నటుడు పురస్కారానికి నామినేషన్ పొందడమే కాకుండా.. విమర్శకుల వద్ద నుంచి ప్రశంసలు కూడా అందుకున్నాడు.
వీటితో పాటుగా కూలీ నెం. 1, బవాల్, జగ్ జగ్ జీయో, భేదియా వంటి సినిమాల్లో అవకాశం దక్కించుకున్నాడు. చివరగా ఈ హీరో సిటాడెల్ హన్నీ బన్నీ వెబ్ సిరీస్ లో కూడా అద్భుతంగా నటించి మంచి మార్కులు కొట్టేశాడు. ఇందులో టాలీవుడ్ సెన్సేషనల్ హీరోయిన్ సమంత కీలక పాత్రలో నటించి మెప్పించింది. ఇది ఓటీటీ ప్లాట్ ఫామ్ వేదికన విడుదలై మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇకపోతే తాజాగా వరుణ్ ధావన్ సోషల్ మీడియా వేదిక ఓ పోస్ట్ పంచుకున్నారు. తన కూమార్తెతో కలిసి మ్యాచ్ చూస్తోన్న ఫొటోను షేర్ చేసి.. అప్పుడు నేను నాన్నతో చూసేవాడిని ఇప్పుడు తన పాపతో చూస్తానని రాసుకొచ్చాడు. ఈ పిక్‌లో తన పాప ఫేస్‌ను లవ్ సింబల్ ఎమోజీతో కవర్ చేశాడు. ఇక నటాషా దలాల్ ను వివాహం చేసుకుని.. అటు ఫ్యామిలీ లైఫ్‌ను, ఇటు మూవీల్లో నటిస్తూ లైఫ్ లీడ్ చేస్తున్నాడు.






