- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సైకో కిల్లర్ పాత్రలో టాలీవుడ్ హీరోయిన్ ?
టాలీవుడ్ ఇండస్ట్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది హీరోయిన్లు అతి తక్కువ

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్ లో ఎంత మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కొంత మంది హీరోయిన్లు అతి తక్కువ కాలంలోనే సక్సెస్ అయి ముందుకు వెళ్తూ ఉంటారు. అలాంటి హీరోయిన్లలో వర్ష బొల్లమ్మ (Varsha Bollamma) ఒకరు. ఈ అందాల తార చేసిన సినిమాలు తక్కువైనప్పటికీ... ఆమె క్రేజ్ మాత్రం మామూలుగా ఉండదు. కన్నడకు చెందిన ఈ అందాల తార చూసి చూడంగానే అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది.
ఆ తర్వాత మిడిల్ క్లాస్ మెలోడీస్ సినిమాలో సంధ్య పాత్రలో కనిపించి అందరిని మెప్పించారు హీరోయిన్ వర్ష బొల్లమ్మ. ఆ తర్వాత స్వాతిముత్యం సినిమాలో భాగ్యలక్ష్మి గా కనిపించి అందరిని మెప్పించారు. ఇక ఇప్పుడు ఏకంగా హీరో నితిన్ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ అందాల తార. హీరో నితిన్ నటించిన తమ్ముడు సినిమాలో.. వర్ష బొల్లమ్మ హీరోయిన్ గా నటిస్తున్నారు. అయితే ఈ సినిమా శుక్రవారం రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన విషయాలను, ఆమె డ్రీమ్స్ గురించి కూడా చెప్పుకొచ్చారు.
ఈ సందర్భంగా తనకు నచ్చిన పాత్ర గురించి కూడా రివిల్ చేశారు హీరోయిన్ వర్ష బొల్లమ్మ. తనకు సైకో కిల్లర్ పాత్రలు అంటే చాలా ఇష్టమని వెల్లడించారు. అలాంటి పాత్ర వస్తే కచ్చితంగా చేయాలన్నదే తన డ్రీమ్ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో అలాంటి అవకాశం వస్తే కచ్చితంగా సద్వినియోగం చేసుకుంటానని చెప్పుకొచ్చారు హీరోయిన్ వర్షా. అతి త్వరలోనే రెండు సినిమాలు చేయబోతున్నట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు.






