Varsha Bollamma : ఈ మూవీ థియేటర్‌లో ఎందుకు చూడలేదా అని ఫీల్ అవుతారు.నితిన్ మూవీపై కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-07-01 16:01:09  IST  )

హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’.

Varsha Bollamma : ఈ మూవీ థియేటర్‌లో ఎందుకు చూడలేదా అని ఫీల్ అవుతారు.నితిన్ మూవీపై  కామెంట్స్
X

దిశ, సినిమా: హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తమ్ముడు’. శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీలో సప్తమి గౌడ్, లయ, వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ మూవీ.. భారీ అంచనాల మధ్య జులై 4న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. దీంతో ప్రమోషన్స్‌లో జోరు పెంచిన చిత్ర బృందం.. తాజాగా ‘తమ్ముడు’ రిలీజ్ ట్రైలర్ లాంచ్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ సందర్భంగా వర్ష బొల్లమ్మ మాట్లాడుతూ సినిమాపై మరిన్ని అంచాలను పెంచేసింది.

‘మనం చూడాలనుకుని థియేటర్‌లో మిస్ అయిన సినిమాలు చాలా ఉంటాయి. నాకు ఇలా చాలాటైమ్స్ జరిగింది. ఇంట్లో ఆ మూవీ చూసినప్పుడు అరే ఈ సినిమా థియేటర్‌లో చూసుంటే బాగుండేదే అలా ఫీల్ అయ్యేదాన్ని. అలా నేను మిస్ అయినా వాటిలో మగధీర, ఆర్య, జురాసిక్ పార్క్, జుమాంజీ ఇలా చాలా సినిమాలు ఇంట్లో చూసినప్పుడు.. ఛా ఇవి థియేటర్‌లో చూసేంటే ఎంత బాగుండు అని నాకు నేను షిట్ అనుకునేదాన్ని. అలాంటి ఒక థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమా ‘తమ్ముడు’. ఇది థియేటర్‌లో చూడకపోతే.. అయ్యో నేను ఈ సినిమాను థియేటర్‌లో ఎందుకు చూడలేదు అనుకుంటారు. దయచేసి ఈ సినిమా థియేటర్‌లో చూడండి. ప్రొపర్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుంది. జులై 4న రిలీజ్ అవుతోంది.. థియేటర్‌లో చూసి ఎంజాయ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి’ అని తెలిపింది.

Next Story