- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘వారణాసి’ టైటిల్ ఈవెంట్ మేకింగ్ వీడియో.. మహేశ్ ఎంట్రీ కోసం ఇంత కష్టపడ్డారా?
దర్శకదీరుడు రాజమౌళి ఏం చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సినిమాకు జక్కన్న ఓ కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. సినిమా తీయడంలోనే కాకుండా దానిని ప్రమోషన్ చేయడంలోనూ జక్కన్న స్టైల్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆయన తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ ను ఘనంగా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు.

దిశ, వెబ్ డెస్క్: దర్శకదీరుడు రాజమౌళి ఏం చేసినా అందులో ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రతి సినిమాకు జక్కన్న ఓ కొత్త కాన్సెప్ట్ తో వస్తాడు. సినిమా తీయడంలోనే కాకుండా దానిని ప్రమోషన్ చేయడంలోనూ జక్కన్న స్టైల్ వేరే లెవల్ అనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే ఆయన తెరకెక్కిస్తున్న వారణాసి సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్ ను ఘనంగా డిఫరెంట్ గా ప్లాన్ చేశాడు. భారీ డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేసి టైటిల్ రిలీవ్ చేశారు. అంతేకాకుండా ఈవెంట్ లో మహేశ్ బాబు ఎంట్రీ సైతం హైలెట్ గా నిలిచింది. సినిమాలో మహేశ్ బాబు నందిపై వచ్చే సీన్ ఉండగా ఈవెంట్ లో సైతం మహేశ్ బాబు నందిపై ఎంట్రీ ఇచ్చాడు.
అయితే దీని కోసం ఎంతలా కష్టపడ్డారో తెలిపే మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. వీడియోలో రాజమౌళి దగ్గరుండి మరీ మహేశ్ ఎంట్రీ కోసం నందిని సిద్ధం చేయించాడు. దాని సెట్ ఏర్పాటు చేసేందుకు చాలా మంది కార్మికులు కష్టపడ్డారు. పెద్ద గోతిని తీసి ఎంట్రీకి కావాల్సిన సెటప్ ఏర్పాటు చేశారు. దానిపై నందిని నిలబెట్టారు. దీని కోసం జేసీబీలు, క్రేన్లను సైతం ఉపయోగించారు. ఇక తాజాగా రిలీజ్ చేసిన మేకింగ్ వీడియో సైతం జక్కన్నకు సినిమాపై ఉండే ప్రేమను మరోసారి రుజువు చేసింది. video






