Varanasi: ఆ ఇద్దరిపై కీలక సన్నివేశాల చిత్రీకరణ

by Pulgam srinivas |

వారణాసి మూవీ షూటింగ్ హైదరాబాదులో వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు, పృథ్వీరాజ్‌లపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

Varanasi: ఆ ఇద్దరిపై కీలక సన్నివేశాల చిత్రీకరణ
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, ప్రియాంక చోప్రా హీరోయిన్‌గా, దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “వారణాసి” సినిమా ఇప్పటికే భారీ హైప్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ పృధ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్రలో కనిపించబోతుండడం కూడా ప్రత్యేక ఆకర్షణగా మారింది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాదులో వేగంగా కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం మహేష్ బాబు, పృథ్వీరాజ్‌లపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సన్నివేశాలు కథలో చాలా ముఖ్యమైన మలుపులు తీసుకురావనున్నాయని టాక్. ఇప్పటివరకు రాజమౌళి తెరకెక్కించిన ప్రతి సినిమా భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

ముఖ్యంగా ఆయన రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం వల్ల ఆయనకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ పెరిగింది. అందుకే “వారణాసి”పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా కూడా హిట్ అయితే, రాజమౌళి రేంజ్ మరింతగా పెరగడం ఖాయం.

Next Story