- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Varalakshmi: హీరోయిన్‌కు విశాల్ ఆరోగ్యంపై ప్రశ్న.. ఏమని సమాధానమిచ్చిందంటే?
ప్రస్తుతం నెట్టింట విశాల్ హెల్త్ వార్తలు దుమారం రేపుతున్నాయి.

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం నెట్టింట విశాల్(Vishal) హెల్త్ వార్తలు దుమారం రేపుతున్నాయి. ఇప్పటికే జయం రవి(Jayam Ravi), ఖుష్బూ(Khushboo) పలువురు ఈ హీరో ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి. విశాల్ వైరల్ ఫీవర్, తీవ్రమైన బాడీ పెయిన్స్‌తో బాధపడుతున్నారని.. డాక్టర్లు ఆయన్ను రెస్ట్ తీసుకోవాలన్నారని, కానీ విశాల్ ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా సినిమా ప్రమోషన్స్‌కు హాజరవుతున్నారని విశాల్ మేనేజర్ కూడా నెట్టింట ఓ పోస్ట్ పెట్టిన విషయం తెలిసిందే.
అయితే మదగజ రాజ(Madagaja Raja) సినిమా ప్రచారంలో భాగంగా నటి వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో హాజరైంది. తన మ్యారేజ్ లైఫ్ గురించి మాట్లాడింది. భర్త నికోలయ్ సచ్ దేవ్(Nikolai Such Dev) చాలా మంచి పర్సన్ అని, అలాంటి హస్బెండ్ రావడం నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానని వెల్లడించింది. ఫ్యామిలీ లైఫ్‌కు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తాడని.. నా కంటే తనే మా ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎక్కువగా ఫోన్‌లో మాట్లాడుతుంటారని పేర్కొంది. అమ్మవాళ్లు కూడా నికోలయ్‌కే అన్ని విషయాలు పంచుకుంటారని తెలిపింది.
అలాగే విశాల్ ఆరోగ్యంపై ప్రశ్న ఎదురవ్వగా.. ఆయన హెల్త్ తొందరగా రికవరీ అవ్వాలని కోరుకుంటున్నానని, అభిమానుల ఆశీస్సులు ఎప్పుడు విశాల్ పై ఉంటాయని చెప్పుకొచ్చింది. అలాగే డైరెక్టర్ సుందర్(Director Sundar) షూటింగ్ సమయంలో బాగా సపోర్ట్ చేశారని, చాలా సరదాగా గడిచిపోయిందని తెలిపింది. ముఖ్యంగా సంబంధించైతే చాలా విషయాలు దర్శకుడి దగ్గర నేర్చుకున్నానని వివరిచింది. విశాల్ కూడా మూవీ కోసం చాలా కష్టపడ్డారని, ఈ మూవీలో తను 8 ప్యాక్ బాడీతో కనిపించనున్నారని వెల్లడించింది. ఈ చిత్రం కంప్లీట్‌గా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.






