Urvashi Rautela: బాలయ్యపై ఊర్వశి ఇంట్రెస్టింగ్ ట్వీట్.. నిద్రలోంచి ఇప్పుడే లేచావా అంటూ నెట్టింట దారుణ ట్రోల్స్

by Mallepaka Hamsa |

బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది.

Urvashi Rautela: బాలయ్యపై ఊర్వశి ఇంట్రెస్టింగ్ ట్వీట్.. నిద్రలోంచి ఇప్పుడే లేచావా అంటూ నెట్టింట దారుణ ట్రోల్స్
X

దిశ, సినిమా: బోల్డ్ బ్యూటీ ఊర్వశి రౌటేలా(Urvashi Rautela) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ అమ్మడు పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్‌లో చేసి ఫుల్ పాపులారిటీ తెచ్చుకుంది. ఇటీవల ఊర్వశి బాలయ్యతో ‘డాకు మహారాజ్’(Daku Maharaj) దంచు బాల అనే సాంగ్ చేసి ఫుల్ ఫేమ్ తెచ్చుకుంది. ఇందులో వీరిద్దరు చేసిన డ్యాన్స్ పెద్ద దుమారం రేపిన విషయం తెలిసిందే. బాబీ కొల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal), శ్రద్ధా శ్రీనాథ్(Shraddha Srinath) హీరోయిన్లుగా నటించారు.

అయితే సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ మూవీ జనవరి 12న థియేటర్స్‌లోకి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. అంతేకాకుండా భారీ కలెక్షన్లు రాబట్టి బాక్సాఫీసును షేక్ చేయడంతో పాటు పలు రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ఇందులోని ఐటమ్ సాంగ్‌కు భారీ రెస్పాన్ వచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఊర్వశి పలు ఇంటర్వ్యూలో పాల్గొని చిక్కుల్లో పడింది. మా సినిమా హిట్ అయింది అని చెప్పడంతో పాటు కలెక్షన్లు పదే పదే చెప్తూ ట్రోల్స్ ఎదుర్కొంది. ఇదిలా ఉంటే.. ‘డాకు మహారాజ్’ రిలీజ్ అయి ఘన విజయం సాధించాక ఆయనకు పద్మభూషణ్ వచ్చింది. ఇక దీంతో సినీ ప్రముఖులంతా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.

కానీ ఊర్వశి మాత్రం వారం తర్వాత బాలయ్య పద్మభూషణ్ గురించి పోస్ట్ పెట్టి ట్రోల్స్‌కు గురవుతోంది. తాజాగా, ఈ అమ్మడు ట్విట్టర్ ద్వారా ఆయనకు శుభాకాంక్షలు చెప్పింది. ‘‘నందమూరి బాలకృష్ణకు ప్రతిష్టాత్మక పద్మభూషణ్‌ వచ్చినందుకు హృదయపూర్వక అభినందనలు! మీ వారసత్వం ఇప్పుడు మా సాంస్కృతిక చరిత్రలో మరింత స్థిరపడింది. నిజంగా మీరు అందరికీ స్ఫూర్తి’’ అని రాసుకొచ్చింది. అలాగే ‘డాకు మహారాజ్’ ఐటమ్ సాంగ్ వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. అది చూసిన నెటిజన్లు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇప్పుడే నిద్రలోంచి లేచావా ఆయనకు పద్మభూషన్ వచ్చి వారం దాటింది నీకు ఇప్పుడే తెలిసిందా? అని ఫైర్ అవుతున్నారు.

Next Story