- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోర్ట్, బ్యాండ్ మేళం తర్వాత హర్ష రోషన్ నెక్ట్స్ మూవీపై అదిరిపోయే అప్డేట్
కోర్ట్ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన యువ నటుడు హార్ష రోషన్.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నాడు.

దిశ, సినిమా: కోర్ట్ చిత్రంతో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చిన యువ నటుడు హార్ష రోషన్.. ప్రస్తుతం టాలీవుడ్ ప్రేక్షకుల్లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నాడు. కోర్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత ఈ యంగ్ హీరో రీసెంట్‌గా ‘బ్యాండ్ మేళం’తో మరోసారి ఆడియన్స్‌ను అలరించాడు. కంటెంట్‌తో బాక్సాఫీస్ వద్ద మెప్పిస్తున్న హర్ష నుంచి వచ్చే తదుపరి సినిమాపై ప్రేక్షకుల్లో కాస్త ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఈ హీరో తదుపరి చిత్రానికి సంబంధించిన ఓ అప్డేట్ అయితే వచ్చింది. ఈరెండు చిత్రాల తర్వాత హర్ష తన తదుపరి ప్రాజెక్టు కోసం విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో ఓ మూవీ చేస్తున్నాడు. ‘తెల్ల కాగితం’ అనే టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ మూవీపై ఇప్పటికే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రాగా.. కొత్త దర్శకుడు రమేష్ తెరకెక్కిస్తుండగా దిల్ రాజు నిర్మిస్తున్నారు. 20 ఏళ్ల క్రితం ఏపీలో జరిగిన నేపథ్యంలో సాగే ఈ చిత్రం సమ్మర్ స్పెషల్‌గా మేలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తుండగా.. ఈ ఈ నెలాఖరున టీజర్ రానుందని ఫిలిమ్ వర్గాల నుంచి సమాచారం.






