శ్రీనివాస మంగాపురం నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్‌పై అప్డేట్.. ట్వీట్ వైరల్

by I. Sairam |

సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అన్న రమేష్ బాబు(Ramesh Babu) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ(Ghattamaneni Jayakrishna) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శ్రీనివాస మంగాపురం’(Srinivasa Mangapuram).

శ్రీనివాస మంగాపురం నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్‌పై అప్డేట్.. ట్వీట్ వైరల్
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) అన్న రమేష్ బాబు(Ramesh Babu) కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ(Ghattamaneni Jayakrishna) హీరోగా నటిస్తున్న తాజా సినిమా ‘శ్రీనివాస మంగాపురం’(Srinivasa Mangapuram). ఈ క్రేజీ ప్రాజెక్టును RX 100, మంగళవారం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన కల్ట్ దర్శకుడు అజయ్ భూపతి(Ajay Bhupathi) తెరకెక్కించనున్నాడు.

ఇప్పటికే షూటింగ్ కూడా స్టార్ట్ అయిన ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ రాషా తడాని(Rasha Thadani) హీరోయిన్ గా నటిస్తోంది. లవ్ అండ్ మిస్ట‌రీ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న‌ ఈ చిత్రాన్ని చంద‌మామ క‌థ‌లు బ్యాన‌ర్‌పై పి. కిర‌ణ్(P.Kiran) నిర్మిస్తుండగా.. అశ్వ‌నీద‌త్(Ashwin dutt) స‌మ‌ర్పిస్తున్నాడు. జీవీ ప్రకాష్(GV Prakash) సంగీతం అందిస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ నుంచి హీరోయిన్ ఫస్ట్ లుక్ రాబోతుందంటూ మూవీటీమ్ వెల్లడించింది.

ఈ మేరకు ఎక్స్ వేదికగా ఓ స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తూ.. ‘అతని రస్టిక్ ప్రపంచంలో, ఆమె అతని ప్రశాంతత, అతని ఓదార్పు మరియు అతని వేదన.. రేపు ఉదయం 11 గంటలకు శ్రీనివాస మంగాపురం నుండి 'మంగ'గా రాషా తడాని మొదటి చూపును ఆవిష్కరిస్తున్నాము’ అని రాసుకొచ్చారు. ఇక పోస్టర్‌లో కేవలం వేళ్లకు నెయిల్ పాలిష్ పెట్టుకున్న చేయిని మాత్రమే చూపించారు. పర్పుల్ కలర్ చున్నీ గాలిలో ఎగురుతూ కనిపించింది. దీంతో ఆమె ఫస్ట్ లుక్‌పై ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెరిగిపోయింది.

Next Story