Upasana: ఈరోజును ఇంత స్పెషల్‌లో చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.. మెగా కోడలు ఉపాసన ఎమోషనల్ పోస్ట్

by Chukka Sudharani |

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణ, మెగా కోడలు ఉపాసన (Upasana) కొణెదెల అందరికి సుపరిచితమే.

Upasana: ఈరోజును ఇంత స్పెషల్‌లో చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.. మెగా కోడలు ఉపాసన ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) సతీమణ, మెగా కోడలు ఉపాసన (Upasana) కొణెదెల అందరికి సుపరిచితమే. ఈమె సినిమాల్లో నటించనప్పటికీ.. పలు రకాలుగా సాయం అందిస్తూ ప్రజల మన్ననలు పొందుతోంది. అలాగే రామ్ చరణ్‌తో కలిసి పలు ఈవెంట్స్‌లో కూడా మెరుస్తూ సందడి చేస్తారు. ఇక నిత్యం సోషల్ మీడియా(Social media)లో యాక్టీవ్‌గా ఉండే ఉపాసన.. తన ఫ్యామిలీ(Family)కి సంబంధించిన ఎన్నో విషయాలను ప్రేక్షకులతో పంచుకుంటారు. ఈక్రమంలోనే తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టింది ఉపాసన.

మార్చి 27 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బర్త్‌డే (Birthday) జరిగిన విషయం అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ(Mega Family)తో పాటు, సినీ సెలబ్రిటీలు(Movie celebrities), అభిమానులు (fans) సోషల్ మీడియా వేదికగా పుట్టిన రోజు శుభకాంక్షలు తెలిపారు. రామ్ చరణ్ ఫ్యాన్స్ పలు చోట్లా అన్నదానం, రక్తదానం, కేక్ కటింగ్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అలాగే సెలబ్రిటీలు కూడా రామ్ చరణ్‌ను కలిసి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఉపాసన తన సోషల్ మీడియా అకౌంట్ X వేదికగా షేర్ చేస్తూ.. ‘మార్చి 27 ను ఇంత ప్రత్యేకమైన రోజుగా చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.. మీకు ఎప్పటికీ కృతజ్ఞతతో’ అంటూ ఎమోషనల్ ఎమోజీస్ షేర్ చేసింది ఉపాసన. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.

Next Story