RAMCHARAN-UPASANA: మరోసారి తల్లి కాబోతున్న ఉపాసన.. సీమంతం వీడియో చూశారా?

by Ajay Maddhiboyina |   (  Updated:2025-10-23 11:18:58  IST  )

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు. గ‌త కొంత‌కాలంగా ఉపాస‌న ప్రెగ్నెసీపై వార్త‌లు వ‌స్తుండ‌గా తాజాగా ఆ వార్త‌ల‌కు తెర‌ప‌డింది. ఉపాస‌న త‌న సీమంతం వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.

RAMCHARAN-UPASANA: మరోసారి తల్లి కాబోతున్న ఉపాసన.. సీమంతం వీడియో చూశారా?
X

దిశ‌, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చ‌ర‌ణ్ ఆయ‌న స‌తీమ‌ణి ఉపాస‌న మ‌రో బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌బోతున్నారు. గ‌త కొంత‌కాలంగా ఉపాస‌న ప్రెగ్నెసీపై వార్త‌లు వ‌స్తుండ‌గా తాజాగా ఆ వార్త‌ల‌కు తెర‌ప‌డింది. ఉపాస‌న త‌న సీమంతం వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. వీడియోకు ఈ దీపావ‌ళికి డ‌బుల్ సెల‌బ్రేషన్స్, డ‌బుల్ ల‌వ్, డ‌బుల్ బ్లెస్సింగ్స్ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అంతేకాకుండా ఉపాస‌న సీమంతం వేడుక ఎంతో ఘ‌నంగా జ‌ర‌గ్గా కుటుంబ స‌భ్యుల‌తో పాటు టాలీవుడ్ ప్ర‌ముఖులు వీడియోలో మెరిసారు.

హీరో వెంక‌టేష్ త‌న సతీమ‌ణితో క‌లిసి వేడుక‌కు హాజ‌ర‌వ్వ‌గా నాగార్జున ఫ్యామిలీ సైతం వ‌చ్చారు. వీరితో పాటు కోలీవుడ్ హీరోయిన్ న‌య‌న‌తార త‌న భ‌ర్త, పిల్ల‌ల‌తో క‌లిసి హాజ‌రైంది. ఇక మెగాఫ్యామిలీ నుండి ఉపాస‌న‌, వ‌రుణ్ తేజ్, నాగ‌బాబు, వైష్ణ‌వ్ తేజ్, ప‌వ‌న్ స‌తీమ‌ణి వేడుక‌లో మెరిసారు. ప్ర‌స్తుతం ఉపాస‌న షేర్ చేసిన ఈ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతోంది. దీంతో అభిమానులు క్లింకార‌కు త‌మ్ముడు వ‌చ్చేస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. వీడియో

Read More: మెగా ఫ్యాన్స్‌కు డబుల్ గుడ్ న్యూస్.. చెర్రీ-ఉపాసనకు కవలలు

Next Story