ఉగాది సెలబ్రేషన్స్ వీడియో పంచుకున్న ఉపాసన.. బేబీ పింక్ డ్రెస్సులో క్లీంకార ఎంత ముద్దుగుందో?

by Kodari Anjali |

నేడు సినీ సెలబ్రిటీలు అంతా ఉగాది సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తమ అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు.

ఉగాది సెలబ్రేషన్స్ వీడియో పంచుకున్న ఉపాసన.. బేబీ పింక్ డ్రెస్సులో క్లీంకార ఎంత ముద్దుగుందో?
X

దిశ, వెబ్‌డెస్క్: నేడు సినీ సెలబ్రిటీలు అంతా ఉగాది సెలబ్రేషన్స్ కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తమ అభిమానులతో సోషల్ మీడియాలో పంచుకున్నారు. సంప్రదాయ లుక్‌లో ఒకరిని మించి ఒకరు జనాల్ని ఆకట్టుకుంటున్నారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) కోడలు ఉపాసన (Upasana) ఉగాది సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో ఫ్యాన్స్‌తో పంచుకుంది. ఈ వీడియోలో మెగాస్టార్ ఇంట్లోని దేవుడి రూం మొత్తం కవర్ అయింది.

పూజలో ఉపాసన, సురేఖ (Surekha), మెగా ప్రిన్సెస్ క్లీంకార (Kleenkara) కనిపిస్తున్నారు. కానీ చిన్న లవ్ ఎమోజీతో కవర్ చేసినప్పటికీ ఈ అమ్మడు ఫేస్ సైడ్ నుంచి క్లియర్‌గా కనిపిస్తుంది. బేబీ పింక్ డ్రెస్సు ధరించి ఎంతో చక్కగా పూజలో కూర్చుంది. నానమ్మ, తల్లి మాటలు వింటూ వారి వైపు క్యూట్‌గా చూస్తుంది. ఈ వీడియోకు ఉపాసన ‘ఉగాది శుభాకాంక్షలు. తరతరాలుగా వస్తున్న అనతి సంప్రదాయాలు అమూల్యమైనవి’ అని ఓ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది.

ఇక రామ్ చరణ్ (Ram Charan) అండ్ మెగాస్టార్ చిరంజీవి సినిమా పనుల్లో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ప్రిన్సెస్ రామ్ చరణ్ అండ్ ఉపాసనకు ఏకంగా పదకొండు ఏళ్లకు జన్మించింది. దీంతో మెగా ఫ్యామిలీలో సంబరాలు అంబరన్నంటాయి. ఈ బుజ్జాయి రాకతో తాత చిరంజీవి ఆనందానికి అయితే అవధలు లేవని చెప్పుకోవచ్చు.

Next Story