- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఫిష్ వెంకట్ లైఫ్ ను మార్చిన ఇద్దరు స్టార్ హీరోలు !
టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ (Fish) నిన్న మరణించాడు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ట

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ (Fish) నిన్న మరణించాడు. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ ఇండస్ట్రీలో 100కు పైగా సినిమాలు చేసిన ఫిష్ వెంకట్... కిడ్నీ సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే హైదరాబాదులోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఫిష్ వెంకట్ చికిత్స పొందుతూ మృతి చెందారు. దాదాపు నెలరోజులు ఆసుపత్రిలోనే ఉన్న ఫిష్ వెంకట్.. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో నిన్న రాత్రి మరణించాడు.
ఇది ఇలా ఉండగా.. ఫిష్ వెంకట్ కెరీర్ సక్సెస్ కావడం వెనుక ఇద్దరు స్టార్ హీరోలు ఉన్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. ఆ ఇద్దరు హీరోలలో అలనాటి నటుడు శ్రీహరి ఒకరు. ఆయన కారణంగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోకి వచ్చారు ఫిష్ వెంకట్. ఇక ఈ నేపథ్యంలోనే జూనియర్ ఎన్టీఆర్ హీరోగా చేసిన ఆది సినిమాతో.. ఫిష్ వెంకట్ గుర్తింపు పొందారు.
ఆది సినిమా మంచి సక్సెస్ అందుకోవడంతో... ఫిష్ వెంకట్ కెరీర్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. అలా జూనియర్ ఎన్టీఆర్ (NTR), శ్రీహరి (Srihari) కారణంగానే ఫిష్ వెంకట్ కెరీర్ మారిపోయింది. అటు హైదరాబాద్ లో పుట్టి పెరిగిన వెంకటేష్... మూడో తరగతిలో చదువు ఆపేసి... ముషీరాబాద్ లో చేపల వ్యాపారం చేశాడు. దీంతో ఫిష్ వెంకట్ గా ఆయన పాపులారిటీ సంపాదించుకున్నారు.






