‘పెద్ది’ వాయిదా పడితే లాభపడే రెండు చిత్రాలివే?

by Pulgam srinivas |   (  Updated:2026-04-07 09:32:17  IST  )

పెద్ది విడుదల వాయిదా పడితే, ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ఏప్రిల్ 30 లేదా మే 1న, ‘ఏపిక్’ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు సమాచారం.

‘పెద్ది’ వాయిదా పడితే లాభపడే రెండు చిత్రాలివే?
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో భారీ అంచనాలు కలిగిన చిత్రాల్లో పెద్ది ఒకటి. రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 30న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. అయితే సినిమా షూటింగ్ ఇంకా పూర్తికాకపోవడంతో విడుదల వాయిదా పడే అవకాశం ఉందనే వార్తలు పెద్ద ఎత్తున వచ్చాయి.

అలాంటి పరిస్థితుల్లో స్వయంగా హీరో రామ్ చరణ్, తమ సినిమా ఏప్రిల్ 30న విడుదల అవుతుందని ప్రకటించడంతో, చాలామంది ఈ చిత్రం చెప్పిన తేదీకే ప్రేక్షకుల ముందుకు వస్తుందనే అభిప్రాయానికి వచ్చారు. అయితే ఇప్పటికీ ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. నిజంగానే పెద్ది సినిమాను వాయిదా వేస్తే, ఆ తేదీకి దగ్గరగా లేదా అదే తేదీన విడుదల కావడానికి కొన్ని సినిమాలు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.

ఆ సినిమాల్లో సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘మా ఇంటి బంగారం’, అలాగే ఆనంద్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ‘ఏపిక్’ చిత్రాలు ఉన్నాయి. ‘మా ఇంటి బంగారం’ చిత్రాన్ని ఏప్రిల్ 30 లేదా మే 1న విడుదల చేయాలనే ప్రణాళికలో మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది. అదే విధంగా ‘ఏపిక్’ చిత్రాన్ని మే 1న విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక ఈ రెండు చిత్ర బృందాలు కూడా పెద్ది సినిమా వాయిదా పడిందన్న అధికారిక ప్రకటన కోసం ఎదురుచూస్తున్నట్లు, ఆ ప్రకటన వచ్చిన వెంటనే తమ సినిమాల విడుదల తేదీలను ప్రకటించే అవకాశం ఉందని టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Next Story