- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
యాంకర్ శివజ్యోతికి షాకిచ్చిన టీటీడీ ?
యాంకర్ శివజ్యోతిపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి

దిశ, వెబ్ డెస్క్: యాంకర్ శివ జ్యోతి గురించి తెలియని వారు ఉండరు. తీన్మార్ సావిత్రిగా పాపులారిటీ సంపాదించిన శివజ్యోతి, తెలంగాణ యాస, భాషలో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంటూ ఉంటుంది. ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ లో న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన యాంకర్ శివ జ్యోతి, 2019లో బిగ్ బాస్ హౌస్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత పలు టీవీ షోలలో, ఈవెంట్స్ లో పాల్గొంటూ యాంకరింగ్ చేస్తూ దుమ్ము లేపుతున్నారు. అంతేకాదు, జ్యోతక్క పేరుతో సొంత యూట్యూబ్ ఛానల్ కూడా నడిపిస్తున్నారు.
అయితే అలాంటి యాంకర్ శివ జ్యోతి తాజాగా వివాదంలో చిక్కుకున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం క్యూ లైన్ లో టీటీడీ పాలక మండలి అందించే అన్న ప్రసాదం పై హాట్ కామెంట్స్ చేశారు. మేము రిచెస్ట్ బిచ్చగాళ్ళమంటూ యాంకర్ శివ జ్యోతి చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. దీనిపై తిరుమల శ్రీవారి భక్తులతో పాటు హిందూ సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ వివాదం రాజుకోవడంతో వెంటనే, క్షమాపణలు కూడా చెప్పారు యాంకర్ శివ జ్యోతి. ఈ మేరకు ఓ వీడియోను కూడా వదిలారు. దీంతో సమస్య ముగిసిందని అందరూ అనుకునే లోపు, యాంకర్ శివజ్యోతి గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది.
యాంకర్ శివజ్యోతిపై టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయం తీసుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇంకెప్పుడూ తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలు లేకుండా యాంకర్ శివ జ్యోతి ఆధార్ కార్డును టీటీడీ అధికారులు బ్లాక్ చేసినట్లు సోషల్ మీడియా ఓ న్యూస్ వైరల్ చేస్తున్నారు. ఇటీవల శ్రీవారి ప్రసాదాన్ని అవహేళన చేసినట్లు మాట్లాడిన నేపథ్యంలో శివజ్యోతిపై టీటీడీ యాక్షన్ తీసుకుందని, శివజ్యోతి క్షమాపణలు చెప్పినా వదిలిపెట్టలేదంటూ ప్రచారం చేస్తున్నారు. ఇక ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో హిందూ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. టీటీడీ పాలక మండలి సరైన నిర్ణయం తీసుకుందంటూ మెచ్చుకుంటున్నాయి. క్లిక్






