నాపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ?

by velandi.Saikiran |

సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ... కొంతమంది మాత్రమే స్టార్ డం సంపాదించుకుంటారు. అలాంటి

నాపై ఐరన్ లెగ్ ముద్ర వేశారు.. కన్నీళ్లు పెట్టుకున్న హీరోయిన్ ?
X

దిశ, వెబ్ డెస్క్: సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నప్పటికీ... కొంతమంది మాత్రమే స్టార్ డం సంపాదించుకుంటారు. అలాంటి వారిలో హాట్ బ్యూటీ విద్యా బాలన్ (Vidya Balan ) ఒకరు. బాలీవుడ్ ఇండస్ట్రీ కి సంబంధించిన ఈ భామ.... తెలుగు ప్రేక్షకులకు కూడా చాలా దగ్గర అయింది. ముఖ్యంగా ఆమె కెరియర్ లో వచ్చిన డర్టీ పిక్చర్.. సినిమాతో దేశాన్ని మొత్తం ఒక ఊపు ఊపేసింది.

అయితే అలాంటి హాట్ బ్యూటీ విద్యాబాలన్ కు ఇండస్ట్రీలో కొన్ని అవమానాలు కూడా ఎదురయ్యాయట. ఈ విషయాన్ని స్వయంగా హీరోయిన్ విద్యాబాలన్ పేర్కొన్నారు. ఆమెపై ఐరన్ లెగ్ ముద్ర కూడా వేశారట. మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ తో నటించాల్సిన చక్రం సినిమా ఆగిపోవడంతో.. ఈ ముద్ర వేశారట కొంతమంది సినీ ప్రముఖులు.

కానీ హీరో అలాగే దర్శకుడికి మధ్య జరిగిన భేదాభిప్రాయాల కారణంగా చక్రం సినిమా ఆగిపోయిందని ఆమె క్లారిటీ ఇచ్చారు. ఈ విషయం తెలియకుండా చాలా మంది తనను ఐరన్ లెగ్ అని కూడా అన్నారని ఫైర్ అయింది. ఆ ఒక్క సినిమా ఆగిపోవడంతో నేను ఎనిమిది నుంచి తొమ్మిది సినిమాలు పోగొట్టుకున్నట్లు స్పష్టం చేశారు. ఆ సినిమాలన్నీ రాత్రికి రాత్రి కోల్పోయానని ఎమోషనల్.. అయ్యారు విద్యాబాలన్. కొన్ని సినిమాలలో షూట్ కంప్లీట్ అయ్యాక కూడా తనను తొలగించినట్లు వెల్లడించారు.

Next Story