- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పవన్ కళ్యాణ్ కొడుకు అకీరాపై ట్రోలింగ్...కారణం ఇదే!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు చేసుకుంటూనే రాజకీయాల్లో సమర్థవంతంగా ముందుకు

దిశ, వెబ్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాలు చేసుకుంటూనే రాజకీయాల్లో సమర్థవంతంగా ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టిన పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన పవన్ కళ్యాణ్... డిప్యూటీ ముఖ్యమంత్రి హోదాలో ఇప్పుడు కొనసాగుతున్నారు. దీంతో ఆయన బ్రాండ్ దేశవ్యాప్తంగా పెరిగిపోయింది. డిప్యూటీ ముఖ్యమంత్రి అయిన తర్వాత సినిమాలు తక్కువ చేస్తూ... ప్రజా సేవలో ఎక్కువగా పాల్గొంటున్నారు.
ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా నందన్ పై ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. పవన్ కళ్యాణ్ వేసుకున్న ప్యాంటు ను ఆయన కుమారుడు అకీరా వేసుకున్నాడని సెటైర్లు పెంచుతున్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పర్యటన నేపథ్యంలో.. తన ఇద్దరు కుమారులతో పవన్ కళ్యాణ్ తాజాగా మెరిశారు. విమానాశ్రయంలో... తన ఇద్దరు కుమారులతో కలిసి ప్రకాశం జిల్లాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
అయితే ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ పెద్ద కుమారుడు అకీరా... వేసుకున్న ప్యాంటు పై ట్రోలింగ్ జరుగుతుంది. గతంలో పవన్ కళ్యాణ్ వేసుకున్న ప్యాంటునే ఇప్పుడు అకీరా కూడా ధరించాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంట్లో కబోర్డ్ లో ఉన్న ప్యాంటునే వేసుకుని.. తన తండ్రితో అకీరా వచ్చాడని అంటున్నారు. పవన్ కళ్యాణ్ అందరికీ మార్గదర్శకంగా ఉంటాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు తన కొడుకు కూడా పవన్ కళ్యాణ్ స్టైల్ ఫాలో అవుతున్నాడని మరి కొంతమంది అంటున్నారు.
Instagramme Link






