- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Nushrat Bharucha : స్టేజ్‌పై బలుపు చూపించిన బాలీవుడ్ బ్యూటీ.. ఏకిపారేస్తున్న నెటిజన్లు
బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా (Nushrat Bharucha) అందరికి సుపరిచితమే.

దిశ, సినిమా: బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా (Nushrat Bharucha) అందరికి సుపరిచితమే. టీవీ సీరియల్స్(TV serials)తో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈమె.. ‘జై సంతోషి మా’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చింది. ఇక 2010లో ‘తాజ్ మహాల్’ చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ‘ఛత్రపతి’ సినిమాతో 2023లో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించగా.. వివి వినాయక్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలే పోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ అమ్మడు నెట్టింట దారుణమైన ట్రోల్స్ ఎదుర్కొంటోంది.
తాజాగా ముంబైలో లక్మే ఫ్యాషన్ (Lakme Fashion) వీక్ 2025 ఎంతో గ్రాండ్‌గా స్టార్ట్ అయింది. లక్మీ ఫ్యాషన్ వీక్ X FDCI'S 25వ ఎడిషన్ జోరుగా సాగుతోంది. మార్చి 26న ముంబైలోని అద్భుతమైన జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో ప్రారంభమైన ఈ కోచర్ షో.. రెండవ రోజు భాగంగా బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా పాల్గొంది. ర్యాంప్‌పై తను నడుచుకుంటూ వస్తుండగా.. ఎదురుగా కొంత అమ్మాయిలు నిలబడి ఉన్నారు. అయితే.. ఒక అమ్మాయిని పట్టుకుని పక్కకు పెట్టి వేరే ఇద్దరు అమ్మాయిలను తన పక్కకు తెచ్చుకుంది ఈ బాలీవుడ్ బ్యూటీ నుష్రత్. ఆ ఇద్దరి అమ్మాయిల చేతులు పట్టుకుని వారితో ర్యాంప్ వాక్ చేసింది. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుండగా.. నుష్రత్‌ను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. ‘నీ కంటే నువ్వు పక్కకు నెట్టిన అమ్మాయి చాలా బాగుంది. నీకు అంతా యాటిట్యూడ్ పనికిరాదు’ అంటూ మండిపుడుతున్నారు.






