Trending: స్పృహలోకి వచ్చిన సింగర్ కల్పన.. సంచలన వీడియో విడుదల

by Kema Shiva Kumar |   (  Updated:2025-03-08 02:26:23  IST  )

టాలీవుడ్(Tollywood) సీనియర్ సింగర్ కల్పన(Singer Kalpana) ఆత్మహత్యాయత్నం ఇండస్ట్రీలో కలకలం రేపింది.

Trending: స్పృహలోకి వచ్చిన సింగర్ కల్పన.. సంచలన వీడియో విడుదల
X

దిశ, వెబ్‌డెస్క్ / శేరిలింగంపల్లి: టాలీవుడ్ (Tollywood) సీనియర్ సింగర్ కల్పన (Singer Kalpana) ఆత్మహత్యాయత్నం రాష్ట్రంలో కలకలం రేపింది. స్లీపింగ్ పిల్స్ (Sleeping Pills) మింగి రెండ్రోజులు బెడ్ రూంకే పరిమితమైన ఆమెను కాలనీవాసులు పోలీసుల సాయంతో మంగళవారం ఆసుపత్రిలో చేర్పించారు. ఈ మేరకు ఆమె ఆరోగ్యం కుదుటపడటంతో గురువారం రాత్రి స్పృహలోకి వచ్చారు. ఈ క్రమంలోనే సింగర్ కల్పన సోషల్ మీడియా (Social Media) వేదికగా సంచలన వీడియో విడుదల చేశారు. అయితే, ఆ వీడియోలో కల్పన మాట్లాడుతూ.. తన గురించి అదేవిధంగా తన భర్త గురించి న్యూస్‌, సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సర్క్యూలేట్ అవుతున్నాయని అన్నారు. 45 ఏళ్లు వచ్చిన తను పీహెచ్‌డీ (PHD)తో పాటు ఎల్‌ఎల్‌బీ (LLB) చేస్తున్నానని అన్నారు. అన్ని తన భర్త ఎంకరేజ్ చేయడం వల్లే సాధ్యం అవుతోందని తెలిపారు.

మరోవైపు మ్యూజికల్ కాన్సర్ట్స్‌ (Musical Concerts)లో పాల్గొంటున్నానని అన్నారు. ఒకేసారి అన్ని పనులతో చాలాకాలంగా తనకు నిద్ర కరువైందని.. వైద్యుడి వద్ద ఇన్సోమియా (Insomnia) ట్రీట్‌మెంట్ తీసుకునే సమయంలో ఒక ప్రిస్క్రిప్షన్ ఇచ్చారని తెలిపారు. అందులో ఉన్న ఓ మెడిసిన్ కొంత ఎక్కువ మోతాదులో తీసుకున్నా కాబట్టే స్పృహ కోల్పోయానని క్లారిటీ ఇచ్చారు. ఇవాళ తాను జీవించి ఉన్నానంటే అందుకు కారణం తన భర్త ప్రసాద్ ప్రభాకరేనని అన్నారు. ఆయన తన వద్ద లేకపోయిన కాలనీ వాళ్లకు, పోలీసులకు సమాచారం అందజేసి సకాలంలో ఆసుపత్రికి తనను తీసుకువెళ్లేలా చేశారని తెలిపారు. తమ కుటుంబంలో ఎలాంటి విబేధాలు లేవని.. మీడియాతో పాటు సోషల్ మీడియా (Social Media)లో వచ్చే వార్తలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు. తన మీద ఫ్యాన్స్, సహచరులు చూపించిన ప్రేమను ఎప్పటికీ మరువలేనని సింగర్ కల్పన అన్నారు.

Next Story