- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Anasuya: ట్రెండ్ సెట్టర్ అనసూయ ఎమోషనల్ పోస్ట్..
హాట్ యాంకర్ అనసూయ ఇటీవలే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

దిశ, వెబ్‌డెస్క్: హాట్ యాంకర్ అనసూయ ఇటీవలే కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. అయితే అనసూయ కొత్తింట్లో సత్యనారాయణ స్వామి వ్రతం జరిపినట్లు తెలస్తోంది. కాగా ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ఈ చిత్రాలు వెనక నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్న విషయం ఇదే..
ఈ నెల 3వ తేదీన మేము మా కొత్తింట్లో కొన్ని హోమాలు, పూజలు, శ్రీ సత్యనారాయణ స్వామి వారి వ్రతం, మరకత లింగ రుద్రాభిషేకం జరుపుకున్నాం.. చాలా కార్యాలు ఉండటం వల్ల మొదటి హోమం ప్రారంభించే ముందు మా గురువు గారితో పెట్టాలనుకుంటున్నాం. గురువు గారు ఒక 30 సెకన్లు అలా కళ్ళు మూసుకొని ఆ తర్వాత #SriRamaSanjeevani అని పెట్టు అన్నారు..
నేను మా ఆయన చాలా హ్యాపీగా చాలా బావుండి గురువు గారు సరే మరియయ్యా అని అన్నారు. ధర్మపత్ని పూజ చేయుటకు అటు పక్కకి వెళ్ళము.. గురువు గారు హోమం కొనసాగించండి. ఒక 20 నిమిషాలు దాటిన తర్వాత ఇంతలో మా గురువు గారు వచ్చి తన ఫోన్ చూపించారు ఇలా అంటూ.. “అనసూయా.. ఆంజనేయుడు వచ్చాడు..
అంటే నాకు ఊహ తెలిసినప్పటినుంచీ మా నాన్న గారూ.. అంటే మా పాపాజీ నుంచి నేర్చుకుంటున్న మొదటి గొప్ప విషయం. సంతోషంలో విషాదంలో భయాందోళనలో అనరోగ్యంలో ప్రేమలో అన్నిట్లో.. జైహనుమాన్ అని తలుచుకోకుండా నేనేమి చేయాలనుకుంటున్నాను. నా తండ్రి గా భావిస్తానని నా దగ్గరివాళ్లందరికీ తెలుసు. నా పెద్ద కొడుకు శౌర్య అని ఆయన పేరు పెట్టుకున్నాం..
అగ్ని దేవుడు ముక్కోటి దేవతలకు వార్తాహరుడు (దూత) అని అంటారు.. అందుకే ఏ దేవుడికి ఏమైన గట్టిగా చెప్పుకోవాలన్న హోమం ద్వారా చెప్పుకుంటాం. ఈ విధంగా ఆ రోజు నా హనుమాన్జీ మా ఇంటికి పేరుని మా ఇంటిని మమ్మల్ని ఆశీర్వదించటానికి వచ్చాడు. అందరు ఆధ్యాత్మికంగా ఉండరు. నాకు తెలుసు.. కానీ నా సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది. ఇందుగలదందులేదని సందేహము వలదు యెందెందు వెదకి చూసిన అందందేగలడు. జైహనుమాన్ జైశ్రీరామ్’’ అంటూ అనసూయ ఎమోషనల్ ఎమోజీలతో రాసుకొచ్చింది. అందరు ఆధ్యాత్మికంగా ఉండరు.. నాకు తెలుసు.. కానీ నా సత్యానుభవాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది.






