కొత్తదనం కోసం ప్రయాణిస్తా.. హాలీవుడ్‌ను మాయలో పడేసిన హీరోయిన్

by Mallepaka Hamsa |   (  Updated:2025-03-08 15:30:03  IST  )

ఇటీవల కాలంలో చాలా మంది తమ ఫేమ్‌ను పెంచుకుంటూ ఊహించని విధంగా అందరి దృష్టిని ఆకర్శిస్తున్నారు.

కొత్తదనం కోసం ప్రయాణిస్తా.. హాలీవుడ్‌ను మాయలో పడేసిన హీరోయిన్
X

దిశ, సినిమా: ఇటీవల కాలంలో చాలా మంది తమ ఫేమ్‌ను పెంచుకుంటూ ఊహించని విధంగా అందరి దృష్టిని ఆకర్శిస్తున్నారు. మరికొందరు మాత్రం పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో పాటు పలు పోస్టులతో ఓవర్ నైట్ స్టార్స్‌గా మారిపోతున్నారు. అయితే అలా మీటూ ఉద్యమం సమయంలో మాయా పేరు మార్మోగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా, మరోసారి ఆమె వార్తల్లో నిలిచింది. లాస్ ఏంజెల్స్‌లో అమ్మడు సంచలనం సృష్టిస్తోంది. 2025 ఆస్కార్ రెడ్ కార్పెట్‌కు తన యూనిక్ స్టైల్‌తో కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన స్టైలిస్ట్ పోషెన్‌(Poshen)తో కలిసి పని చేయనుంది. హాలీవుడ్ ఫ్యాషన్ ప్రపంచంలో ట్రెండ్ సెట్టర్‌గా గుర్తింపు పొందిన పోషెన్, ప్రముఖ ఫొటోగ్రాఫర్ స్టీవ్‌తో కలిసి మాయా ఎస్ కృష్ణన్‌(Maya S Krishnan)ను ఓ ప్రత్యేక ఫోటోషూట్‌కు ఆహ్వానించారు.

మాయ త్వరలో పారిస్, లాస్ ఏంజిలెస్‌లోనూ ఆడిషన్లకు హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. మాయా ఎస్ కృష్ణన్, తెలుగు చిత్ర పరిశ్రమలోకి ‘ఫైటర్ రాజా’ అనే సినిమా ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ ఏడాదిలోనే విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రాన్ని కొత్త దర్శకుడు కృష్ణ ప్రసాద్(Krishna Prasad) తెరకెక్కిస్తున్నారు. రొటీన్ ప్రేమకథలకు భిన్నంగా ఉండే ఈ రొమాంటిక్ కామెడీ, ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుంటుందని అంచనా వేస్తున్నారు చిత్రబృందం. తాను ఎల్లప్పుడూ కొత్తదనం కోసం ప్రయాణిస్తానని, సినిమా, సంగీతం అనే రెండు రంగాల్లోనూ సంప్రదాయాలను తలకిందులు చేసే ప్రయత్నమే తన లక్ష్యమని చెబుతున్నారు. పెద్ద స్థాయిలో నాటక వేదికను ఏర్పాటు చేయడం నా కల, అది త్వరలోనే సాకారం చేస్తాను’’ అని మాయ చెబుతున్నారు.


Read Also..

సొట్టబుగ్గల సుందరి లేటెస్ట్ ఫొటో షూట్.. సోఫాపై అలా వాలి?

Read Also..

మెట్లపై నుంచి జారి పడిపోయిన కంగనా.. అయ్యో పాపం అనకుండా పొట్టు పొట్టు తిడుతున్న నెటిజన్లు(వీడియో)

Next Story