Tragedy: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్య

by Kema Shiva Kumar |

టాలీవుడ్‌ (Tollywood)లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

Tragedy: టాలీవుడ్‌లో తీవ్ర విషాదం.. నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్య
X

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్‌ (Tollywood)లో మరో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గతంలో డ్రగ్స్ (Durgs) కేసులో అరెస్ట్ అయిన నిర్మాత సుంకర కృష్ణ ప్రసాద్ చౌదరి (Sunkara Krishna Prasad Chowdary) ఇవాళ గోవా (Goa)లో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఓ హోటల్ గదిలో విగత జీవిగా పడి ఉన్న ఆయనను చూసిన సిబ్బంది హుటాహుటిన పోలీసులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు ఘటనా స్థలానికి వెళ్లిన వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు. అయితే, కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్యకు సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 2016లో సినిమా రంగంలోకి అడగు పెట్టిన కేపీ చౌదరి కబాలి (Kabali) చిత్రానికి సహా నిర్మాతగా ఉన్నారు. తెలుగు (Telugu), తమిళ (Tamil) చిత్రాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. సర్ధార్ గబ్బర్ సింగ్, అర్జున్ సురవరం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సినిమాలను డిస్ట్రిబ్యూషన్ చేశారు. కృష్ణ ప్రసాద్ చౌదరి స్వస్థలం ఖమ్మం జిల్లా (Khammam District) బొనకల్ (Bonakal) మండలం కేంద్రంగా తెలుస్తోంది.

కాగా, కృష్ణ ప్రసాద్ చౌదరి (Krishna Prasad Chowdary) మాదక ద్రవ్యాలను విక్రయిస్తున్నాడనే ఆరోపణలతో సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) 2023 జూన్ 14న ఆయనను అరెస్ట్ చేశారు. పోలీసుల తనిఖీల్లో భాగంగా రాజేంద్రనగర్‌ (Rajendra Nagar)లో కేపీ చౌదరి 87.75 గ్రాముల కొకైన్‌ (కాయిన్e)తో పట్టుబడ్డాడు. ఈ మేరకు ఆయన నుంచి 90 కొకైన్‌ ప్యాకెట్లు, రూ.2.05 లక్షల నగదు, నాలుగు మొబైల్‌ ఫోన్లు, కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Next Story