- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పట్టుచీర కట్టిన టాలీవుడ్ యాంకరమ్మ.. అదుర్స్ అంతే అంటూ కామెంట్స్
టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో అక్కడి నుంచి ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ‘పుష్ప’(Pushpa), ‘పుష్ప-2’(Pushpa-2) వంటి భారీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇదిలా ఉంటే.. అనసూయ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ.. తన అభిమానులతో తరచూ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గామారింది. తాజాగా అనసూయ తన సోషల్ మీడియాలో పట్టు చీరలో అందంగా ముస్తాబైన ఫొటోలు షేర్ చేసింది.
వాలు కళ్లతో వయ్యారంగా చూస్తూ యూత్‌ను మెస్మరైజ్ చేసింది. పొనిటెల్ వేసుకున్న ఈ చిన్నది శారీలో చాలా అందంగా కనిపించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్‌గా మారగా.. వీటిని చూసిన నెటిజన్లు అదుర్స్ అంతే అని, దివి నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ.. నిన్ను చూసి కనిపెట్టడా న్యూటన్ గ్రావిటీ అంటూ ఎన్టీఆర్ సాంగ్ లిరీక్స్‌తో కంప్యార్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ చిన్నదాని ఫొటోస్ పై హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కూడా స్పందిస్తూ డ్యామ్ అనే కామెంట్ జోడించింది.






