Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే? (పోస్ట్)

by Mallepaka Hamsa |

టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)కు ఓ యంగ్ హీరో సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించి ఆయనను ఆశ్చర్యానికి గురి చేశారు.

Allu Arjun: అల్లు అర్జున్‌కు బిగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన టాలీవుడ్ యంగ్ హీరో.. ఏం గిఫ్ట్ ఇచ్చాడంటే? (పోస్ట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ హీరో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌(Allu Arjun)కు ఓ యంగ్ హీరో సర్‌ప్రైజ్ గిఫ్ట్ పంపించి ఆయనను ఆశ్చర్యానికి గురి చేశారు. అల్లు అర్జున్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఈ గిఫ్ట్ చూసి చాలా చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇక ఈ విషయాన్ని తెలియజేస్తూ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టడంతో అంతా ఆనందపడుతున్నారు. ఆయన అంత స్పెషల్ గిఫ్ట్ పంపిన ఆ యంగ్ హీరో మరెవరో కాదు.. రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda). వీరిద్దరు చాలా క్లోజ్ అన్న విషయం అందరికీ తెలిసిందే. పలు ఈవెంట్స్‌లో ఒకరిపై ఒకరు అభిమానం చాటుకోవడంతో పాటు సపోర్ట్ చేసుకుంటారు. ఇక అప్పుడప్పుడు గిఫ్ట్స్ కూడా పంపుకుంటారు.

విజయ్ దేవరకొండ రౌడీ బ్రాండ్ స్టోర్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బన్నీకి డ్రెసులు, పిల్లల కోసం బర్గర్‌లను పంపారు. దీంతో అల్లు అర్జున్ ఆ ఫొటోలను షేర్ చేస్తూ ‘‘మై స్వీట్ బ్రదర్ ఎప్పుడూ నువ్వు సర్‌ప్రైజ్ చేస్తుంటావు. సో స్వీట్’’ అనే క్యాప్షన్ జత చేశాడు. అయితే రౌడీ హీరో ఇంతకు ముందు కూడా బహుమతులు పంపిన విషయం తెలిసిందే. కాగా, అల్లు అర్జున్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన అట్లీ దర్శకత్వంలో ఓ ప్రతిష్ఠాత్మకమైన సినిమాను చేయనున్నారు. ‘AA-22’ వర్కింగ్Mrunal Thakur టైటిల్ పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్‌ పిక్చర్స్ బ్యానర్‌పై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. అయితే ఇందులో మృణాల్(Mrunal Thakur), జాన్వీ కపూర్(Janhvi Kapoor), దీపికా పదుకొణె కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు పలు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ కానప్పటికీ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Next Story