- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇంట్లో తీవ్ర విషాదం.. హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ వైరల్
టాలీవుడ్ హీరోయిన్ సదా (Sadha)‘ప్రాణం’, నాగ, వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

దిశ, సినిమా: టాలీవుడ్ హీరోయిన్ సదా (Sadha)‘ప్రాణం’, నాగ, వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ‘జయం’(jayam) సినిమాలో సాంప్రదాయ లుక్‌లో కనిపించి తన పాపులారిటీ పెంచుకోవడంతో పాటు హిట్ సాధించింది. ఒక్క మూవీతో ఆమె ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. విభిన్న కథలతో వచ్చిన ఈ బామ స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. కానీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో 2018లో ఇండస్ట్రీకి దూరం అయింది. ఈ క్రమంలో సదా పలు టీవీ షోస్‌లో జడ్జ్‌గా వ్యవహరించింది. మళ్లీ ‘అహింస’రీఎంట్రీ ఇచ్చిన ఆమె నటించిన ‘మదగజరాజా’ (Madha Gaja Raja)సినిమా 12 ఏళ్ల తర్వాత విడుదలై హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇక సదా మూవీస్ చేయనప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టీవ్‌గా ఉంటుంది. అప్పుడప్పుడు పలు పోస్టులు చేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అయితే వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ అంటే ఇష్టమున్న సదా ఆ రూట్‌లోనే వెళ్తున్నట్లు తెలుస్తోంది. అందుకే సినిమాలు పెద్దగా చేయడం లేదని టాక్. తాజాగా, సదా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ హార్ట్ బ్రేకింగ్ పోస్ట్ పెట్టింది. తన పెట్ డాగ్ లైలా మరణించడంతో దాని ఫొటో షేర్ చేస్తూ ఎమోషనల్ అయింది. ప్రస్తుతం సదా పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.






