Rashmi Gautam: రష్మితో ప్రేమలో పడిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. అరగంటకు ఒకసారి ఫోన్.. సంచలన వీడియో వైరల్

by Mallepaka Hamsa |

గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు కొందరు సినిమాల్లో నటిస్తూనే తమతో నటించే వారితో ప్రేమలో పడుతున్నారు. ఇక వారితో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు.

Rashmi Gautam: రష్మితో ప్రేమలో పడిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్.. అరగంటకు ఒకసారి ఫోన్.. సంచలన వీడియో వైరల్
X

దిశ, సినిమా: గత కొద్ది కాలంగా సినీ సెలబ్రిటీలు కొందరు సినిమాల్లో నటిస్తూనే తమతో నటించే వారితో ప్రేమలో పడుతున్నారు. ఇక వారితో వివాహ బంధంలోకి అడుగుపెడుతున్నారు. కొంతమంది మాత్రం బ్రేకప్ చెప్పేసుకుని మరొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. అయితే ఇలాంటివి చాలానే జరుగుతున్నాయి. ఇక గత కొద్ది రోజుల నుంచి మరో ట్రెండ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ హీరో, హీరోయిన్ కాస్త సన్నిహితంగా కనిపిస్తే చాటు ఒకరికొకరికి కనెక్షన్ లేకపోయినా అనూహ్యంగా వారి మధ్య ప్రేమ ఉందంటూ వచ్చే వార్తలు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అయితే అలాంటి రూమర్స్‌ను నిజం వారు కూడా ఉన్నారు.

ఇదిలా ఉంటే.. తాజాగా, యాంకర్ రష్మి(Rashmi Gautam), రాజమౌళి(Rajamouli)కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఇందులో ఏముందంటే.. రష్మితో అపరిచిత వ్యక్తిగా ఫోన్ లోనే ప్రేమాయణం సాగించిన రాజమౌళి.. ఆమెను స్వయంగా మీట్ అవ్వడానికి వచ్చాడు. ఆయన్ను అక్కడ చూసిన రష్మీ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై పోతుంది. ఇన్నాళ్లూ తనతో ఫోన్ లో మాట్లాడింది రాజమౌళినా అని సంభ్రమాశ్చర్యాలకు గురవుతుంది. ఆ తర్వాత ఇద్దరు కలుసుకుంటారు. ఇక రష్మి నేను నమ్మలేకపోతున్నాను అంటే.. పర్వాలేదు నమ్మొచ్చు అని అంటాడు.

ఇన్ని రోజు నాతో ఫోన్‌లో మాట్లాడింది మీరా? అని అడగ్గా.. రోజులు కాదు గంటలు.. అర గంటకు ఒకసారైనా మాట్లాడి కదా కుచ్ కుచ్ పోతాహై అంటాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే అది పాత వీడియో అయినప్పటికీ అది చూసిన వారంతా ఇదెప్పుడు జరిగిందని ఆశ్చర్యపోతున్నారు. కాగా, రాజమౌళి సినిమాల విషయానికొస్తే.. ఆయన తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘SSMB-29’. ఇందులో టాలీవుడ్ స్టార్ హీరో మహేష్ బాబు(Mahesh Babu), బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా(Priyanka Chopra) ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Next Story