పైరసీ రాకెట్‌లో వెలుగులోకి షాకింగ్ నిజాలు..టాలీవుడ్‌కు రూ.3700 కోట్ల నష్టం

by Ajay Maddhiboyina |

టాలీవుడ్ సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కిరణ్ కుమార్‌ను సైబర్ క్రైం పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.

పైరసీ రాకెట్‌లో వెలుగులోకి షాకింగ్ నిజాలు..టాలీవుడ్‌కు రూ.3700 కోట్ల నష్టం
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కిరణ్ కుమార్‌ను సైబర్ క్రైం పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 నుండి కిరణ్ సినిమాలను పైరసీ చేసి వెబ్ సైట్‌లకు అమ్ముతున్నట్టు గుర్తించారు. ఏడాది కాలంలో 40 తెలుగు సినిమాలు, తమిళసినిమాలు పైరసీ చేసినట్టు గుర్తించారు. ఈ సినిమాల పైరసీతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఏకంగా రూ.3,700 కోట్ల నష్టం జరిగినట్టు తెలుస్తోంది.

కిరణ్ కుమార్ హైదరాబాద్‌లోని థియేటర్లలో కామ్ కార్డ్ ద్వారా సినిమాలను రికార్డ్ చేసి వాటిని వెబ్ సైట్‌లకు అమ్మినట్టు విచారణలో తేలింది. సినిమాలు అమ్మడం ద్వారా అతడికి క్రిప్టో కరెన్సీ రూపంలో వెబ్ సైట్లు డబ్బులు చెల్లించనట్టు పోలీసులు గుర్తించారు. నెలకు 400 క్రిప్టోకరెన్సీ ముట్టజెప్పగా వాటిని కిరణ్ కుమార్ భారతీయ కరెన్సీలోకి మార్చుకున్నట్టు గుర్తించారు. ఇండియన్ కరెన్సీ ప్రకారం అతడు నెలకు దాదాపు రూ.80వేలు సంపాదించినట్టు గుర్తించారు. ఇప్పటి వరకు మొత్తం 65 సినిమాలు రికార్డ్ చేసి అమ్మినట్టు కిరణ్ కుమార్ పోలీసుల వాంగ్మూలంలో ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఈ కేసును పోలీసులు లోతుగా విచారిస్తున్నారు.

Next Story