- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముఖం మీద గాయాలతో కనిపించిన టాలీవుడ్ హీరోయిన్.. ఆందోళనలో ఫ్యాన్స్
టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ హీరోయిన్ సంయుక్త మీనన్(Samyuktha Menon) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘భీమ్లా నాయక్’(Bheemla Nayak) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది తన ఫస్ట్ మూవీతోనే మంచి విజయం సాధించింది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ప్రస్తుతం బాలకృష్ణ(Balakrishna) సరసన ‘అఖండ-2’(Akhanda-2) మూవీతో పాటు మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) సరసన ఓ మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. ఈ చిన్నది నిత్యం సోషల్ మీడియా(Social Media)లో యాక్టీవ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.
అలాగే వ్యక్తిగత విషయాలను పంచుకుంటూ ఫాలోవర్స్‌ను పెంచుకుంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా సంయుక్త మీనన్ తన ఇన్‌స్టా(Instagram)లో ఓ స్టోరీ పెట్టింది. అందులో ముఖం మీద గాయాలతో కనిపించింది. ఇక దీనికి.. ‘సెట్‌లో మీ ఫోటో షేర్ చేయండి.. ఏ సెట్‌లో ఉందో చెప్పడం లేదు’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇక దీన్ని చూసిన నెటిజన్లు, ఆమె ఫ్యాన్స్ స్టార్టింగ్‌లో ఆందోళన చెందగా.. తర్వాత అసలు విషయం తెలిసి హమ్మయ్య అనుకుంటున్నారు.






