అలాంటి వాళ్లకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు... సౌత్ ఇండస్ట్రీపై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

by Chukka Sudharani |   (  Updated:2025-02-15 11:27:42  IST  )

‘శివ మనసులో శృతి’ (Shiva Manasulo Shruti) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రెజీనా కాసాండ్రా(Regina Cassandra).

అలాంటి వాళ్లకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు... సౌత్ ఇండస్ట్రీపై టాలీవుడ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
X

దిశ, సినిమా: ‘శివ మనసులో శృతి’ (Shiva Manasulo Shruti) చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రెజీనా కాసాండ్రా(Regina Cassandra). మొదటి సినిమాతోనే తన నటన, అందంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ కుర్రకారు హృదయాలను కొల్లగొట్టింది. ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ పలు సినిమాల్లో నటించింది. అయితే.. అవేవి ఊహించినంత ఫలితాన్ని అందించలేకపోయాయి. ‘సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌’(Subramaniam for sale), ‘ఎవరు’ వంటి సినిమాలు తప్ప తెలుగులో పెద్దగా విజయాలు దక్కలేవు. దీంతో తమిళంలో సినిమాలు చేసింది. ఇక చాలా గ్యాప్ తర్వాత.. 2022లో ‘శాకిని డాకిని’(Sakini Dakini) చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కూడా అంతగా కలిసిరాలేదు. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే హిందీలో రెండు చిత్రాల్లో నటిస్తోంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన సుమారు 14 ఏళ్ల తర్వాత బాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది రెజీనా. ఇందులో భాగంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రెజీనా నార్త్ అండ్ సౌత్ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసింది.

‘సినీ పరిశ్రమలో సౌత్ కంటే నార్త్ వాళ్లకే ఎక్కువ ఛాన్సులు ఇస్తున్నారు. ఎందుకంటే నేను హిందీ మూవీ ఆడిషన్‌కు వెళ్తే హిందీ బాగా మాట్లాడగలనా? లేదా? అని టెస్ట్ చేస్తారు. కానీ నార్త్ హీరోయిన్లకు లాంగ్వేజ్ రాకున్నా సౌత్‌లో ఛాన్సులొస్తున్నాయి. కొందరు పెద్ద హీరోయిన్లు అవుతున్నారు. అక్కడా, ఇక్కడా నార్త్ వాళ్లనే ఎక్కువగా తీసుకుంటున్నారు. అందుకే నాకు పాత్రలు రావట్లేదు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రజెంట్ రెజీనా కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Next Story