- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తండ్రి చనిపోయిన 3 రోజులకే షూటింగ్ కు వచ్చిన టాలీవుడ్ హీరో !
టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి తరహాల

దిశ, వెబ్ డెస్క్ :టాలీవుడ్ స్టార్ హీరో, మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మెగాస్టార్ చిరంజీవి తరహాలో... టాలీవుడ్ ఇండస్ట్రీలో... చాలా కష్టపడి పైకి వచ్చారు రవితేజ. చిన్న చిన్న సైడ్ క్యారెక్టర్లు చేసుకుంటూ... పెద్ద హీరో అయిపోయారు. ఓ ప్రొడ్యూసర్ అలాగే దర్శకుడి... కష్టం విలువ తెలిసిన హీరోలలో రవితేజ ఒకరు.
అయితే అలాంటి రవితేజ తాజాగా గొప్ప మనసు చాటుకున్నారు. తన తండ్రి చనిపోయి వారం రోజులు తిరగకముందే షూటింగుకు వచ్చి అందరికీ షాక్ ఇచ్చారు రవితేజ. ప్రస్తుతం రవితేజ 76వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు దర్శకుడిగా కిషోర్ తిరుమల వ్యవహరిస్తుండగా ప్రొడ్యూసర్ గా సుధాకర్ ఉన్నారు. అయితే... ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయింది. షూటింగ్ జరుగుతున్న నేపథ్యంలోనే రవితేజ తండ్రి మరణించారు.
రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు వృద్ధాప్య సమస్యలతో బాధపడుతూ.. ఇటీవలే మరణించారు. దీంతో రవితేజ ఇంట విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే తండ్రి మరణించిన తర్వాత రెండు రోజులపాటు విరామం తీసుకున్న రవితేజ... మూడో రోజు నుంచే షూటింగుకు వచ్చేశారు. టైం టు టైం షెడ్యూల్ ఫాలో అవుతూ.. ప్రస్తుతం సినిమా షూటింగ్ లోనే పాల్గొంటున్నారు రవితేజ. దీంతో రవితేజ డెడికేషన్ చూసి... అందరూ ఆశ్చర్యపోతున్నారు. గ్రేట్ హీరో అంటున్నారు.






