‘VD-12’ సినిమాలో ఆ ముగ్గురు స్టార్స్.. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటూ నెటిజన్ల కామెంట్స్ (ట్వీట్)

by Mallepaka Hamsa |   (  Updated:2025-02-12 12:25:18  IST  )

టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఇటీవల ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు.

‘VD-12’ సినిమాలో ఆ ముగ్గురు స్టార్స్.. థియేటర్స్ దద్దరిల్లడం ఖాయం అంటూ నెటిజన్ల కామెంట్స్ (ట్వీట్)
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) ఇటీవల ఫ్యామిలీ స్టార్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ హిట్ అందుకోలేకపోయాడు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘VD-12’. ఈ సినిమాకు గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే(Bhagyashree Borse) హీరోయిన్‌గా నటిస్తోంది. దీనిని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్(Sitara Entertainments), ఫార్చూన్ ఫోర్ బ్యానర్స్‌పై నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander)సంగీతం అందిస్తున్నారు. ఇందులో విజయ్ పోలీసులగా నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్స్ రిలీజ్ అయి ఉత్కంఠను పెంచేశాయి. అయితే ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ఫిబ్రవరి 12న రిలీజ్ కాబోతున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో రౌడీ హీరో ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘VD-12’మూవీలో ముగ్గురు స్టార్ హీరోలు కూడా ఉన్నట్లు సమాచారం. అంటే వారు నటించనప్పటికీ వాయిస్ ఓవర్‌ను ఇస్తున్నారట. ఇదే విషయంపై నిర్మాత నాగవంశీ కూడా స్పందించి క్లారిటీ ఇవ్వడంతో ‘VD-12’ ప్రేక్షకుల్లో అంచనాలు పెరిగిపోతున్నాయి.

తెలుగు వెర్షన్ టీజర్‌కు స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) వాయిస్ ఓవర్ ఇవ్వగా.. తమిళంలో సూర్య(Suriya), హిందీ స్టార్ హీరో రణ్‌బీర్(Ranbir Kapoor) వాయిస్ ఉండనుందని ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుండగా.. ఈ సారి థియేటర్స్ దద్దరిల్లుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. కాగా, విజయ్ దేవరకొండ ‘VD-14’ చిత్రంలోనూ నటిస్తున్నారు. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రాబోతుండగా.. ఇందులో యేధుడిగా విజయ్ కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. అయితే 1854 సంవత్సరం నుంచి 1873 మధ్యలో జరిగిన కథగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక షూటింగ్ పూర్తి అయితే ఈ సమ్మర్‌లోగా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

Next Story