- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అలాంటి పాత్ర కావడంతో ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాను రిజెక్ట్ చేశారు.. ఐశ్వర్య రాజేష్ షాకింగ్ కామెంట్స్
విక్టరీ వెంకటేష్(venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam).

దిశ, సినిమా: విక్టరీ వెంకటేష్(venkatesh), అనిల్ రావిపూడి(Anil Ravipudi) కాంబోలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాతికి వస్తున్నాం’(Sankranthiki Vasthunnam). ఐశ్వర్య రాజేష్(Aishwarya Rajesh), మీనాక్షి చౌదరి(Meenakshi Chowdary) హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని.. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు(Dil Raju) నిర్మించారు. vtv గణేష్, ఉపేంద్ర లిమయే, నరేష్(Naresh), అవసరాల శ్రీనివాస్(Avasarala Srinivas)లు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో(Bheem's Cicerolio) సంగీతాన్ని అందించారు. అయితే సంక్రాంతి కానుకగా నిన్న (జనవరి 14న) థియేటర్లలో ఈ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించి తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్‌ను అందుకుంది. అలాగే కలెక్షన్ల విషయంలోనూ మంచి వసూళ్లు సాధిస్తుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఐశ్వర్య తన పాత్ర గురించి చెబుతూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఆమె మాట్లాడుతూ.. “నిజానికి ఆ పాత్ర నా దగ్గరికి వచ్చే ముందు ముగ్గురు హీరోయిన్స్ రిజెక్ట్ చేశారు. ఈ విషయాన్ని అనిల్ రావిపూడి ముందే నాతో చెప్పారు. నలుగురి పిల్లల తల్లి పాత్ర కావడంతోనే వాళ్లు రిజెక్ట్ చేసినట్లు చెప్పారు. అది పెద్ద ఇష్యూ అనిపించలేదు. ఎందుకంటే భాగ్యం లాంటి మంచి పాత్ర నాకు దొరకడం నా భాగ్యం. కచ్చితంగా ఈ సినిమా చూస్తే అయ్యో ఇంత మంచి పాత్ర వద్దనుకున్నామే అని వాళ్లు బాధపడతారు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






