Kalki 2: 'కల్కి 2'కి దూరంగా ఆ క్రేజీ ప్రొడ్యూసర్లు

by Pulgam srinivas |   (  Updated:2026-04-13 15:05:29  IST  )

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న కల్కి 2898 ఏడి పార్ట్ 2 విషయంలో మైత్రి మూవీ మేకర్స్ సంస్థ కాస్త దూరంగా ఉంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Kalki 2:  కల్కి 2కి దూరంగా ఆ క్రేజీ ప్రొడ్యూసర్లు
X

దిశ, వెబ్ డెస్క్: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో చాలా బిజీగా సమయాన్ని గడుపుతున్నారు. ప్రస్తుతం ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పౌజీ చిత్రంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్, అలాగే నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి 2898 ఏడి పార్ట్ 2 చిత్రంలో నటిస్తున్నాడు. ఈయన నటిస్తున్న అన్ని చిత్రాల్లో ఏదో ఒక రకంగా మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఇన్వాల్వ్ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న స్పిరిట్ మూవీకి సంబంధించిన రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను భారీ ధరకు మైత్రి సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది.

అలాగే పౌజీ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తుంది. కానీ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న 'కల్కి పార్ట్ 2' విషయంలో మాత్రం ఈ సంస్థ పెద్దగా ఇన్వాల్వ్ కావడం లేదని టాలీవుడ్ సర్కిల్లో ఓ వార్త చెక్కర్లు కొడుతోంది. ఇటీవల సంక్రాంతికి ప్రభాస్ హీరోగా రూపొందిన రాజా సాబ్ చిత్రం మంచి అంచనాల నడుమ విడుదలై బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. మరి ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న ఈ మూడు చిత్రాలపై మాత్రం అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలు ఏ స్థాయి విజయాలను అందుకుంటాయో చూడాలి.

Next Story