- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT: రెండు హారర్ మూవీస్‌తో పాటు ఓ బ్లాక్ బస్టర్ చిత్రం కూడా
ఈ వారం ఓటీటీ(OTT)లో సందడి చేయడానికి బ్లాక్ బస్టర్ చిత్రాలు (films), వెబ్ సిరీస్(web series)లు రెడీగా ఉన్నాయి.

దిశ, సినిమా : ఈ వారం ఓటీటీ(OTT)లో సందడి చేయడానికి బ్లాక్ బస్టర్ చిత్రాలు (films), వెబ్ సిరీస్(web series)లు రెడీగా ఉన్నాయి. అవేంటంటే?
కోర్ట్ (Court): ప్రియదర్శి, హర్ష రోహణ్, శ్రీదేవి లీడ్ రోల్స్‌లో నటించిన చత్రం ‘కోర్ట్’. నేచురల్ నాని సమర్పణలో వాల్ పోస్టర్ బ్యానర్‌పై ప్రశాంతి నిర్మించిన ఈ మూవీకి రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు. చిన్న సినిమాగా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని భారీ వసూళ్లను రాబట్టింది. ఇప్పుడు ఈ మూవీ ఏప్రిల్ 11వ తేదీ నుంచి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లి్క్స్‌లో స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధం అవుతోంది.
ప్రవింకూడు షాప్పు (Pravinkoodu Shappu): బాసిల్ జోసెఫ్, సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్, రేవతి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ప్రవింకూడు షాప్పు’. శ్రీరాజ్ శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ మలయాళ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఏప్రిల్ 11వ తేదీ నుంచి డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ఈ విషయంపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఇస్తూ మలయాళంతో పాటు తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానున్నట్లు తెలిపింది.
చోరీ 2 (Chori 2): బాలీవుడ్ నటి నుష్రత్ భరూచా ప్రధాన పాత్లలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఛోరీ 2’. విశాల్ ఫ్యూరియా దర్శకత్వం వహించిన ఈ హిందీ చిత్రాన్ని భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, విక్రమ్ మల్హోత్రా అండ్ జాక్ డేవిస్ నిర్మిస్తున్నారు. చోరీకి సీక్వెల్‌గా వస్తున్న ఈ మూవీలో నుష్రత్ భరూచాతో పాటు సోహా అలీఖాన్, గష్మీర్ మహాజని, సౌరభ గోయల్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఏప్రిల్ 11 నుంచి నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్‍కు రానుంది.
ఛావా (Chava): బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా నటించిన మూవీ ‘ఛావా’. లక్షణ్ రామచంద్ర ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా, డయానా పెంటి, వినీత్ కుమార్ సింగ్ కీలక పాత్రలో నటించిన ‘ఛావా’ చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. బాక్సాషీసు వద్ద భారీ వసూళ్లు రాబట్టి రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ఈ బాలీవుడ్ హిస్టారికల్ యాక్షన్ చిత్రం ఏప్రిల్ 11వ తేదీన నెట్‍ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్‍కు రానుందని అంచనాలు ఉన్నాయి.
పెరుసు (Perusu): తమిళ కామెడీ డ్రామా సినిమా ‘పెరుసు’. ఈ సినిమా మార్చి 14న విడుదలై ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతే కాకుండా ఈ చిత్రం తెలుగులో ‘పెద్ద’ పేరుతో వచ్చి ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఈ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధం అయింది. ‘పెరుసు’ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 11 నుంచి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు.
కింగ్‌స్టన్ (Kingston): కోలీవుడ్ సంగీత దర్శకుడు, హీరో జీవీ ప్రకాష్ కుమార్ నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌స్టన్’. ఇందులో దివ్య భారతి హీరోయిన్‌గా నటించగా.. కమల్ ప్రకాష్ దర్శకత్వం వహించారు. జీ స్టూడియోస్ అండ్ ప్యారాలల్ యూనివర్స్ పిక్చర్స్ బ్యానర్‌పై జీవీ ప్రకాష్ కుమార్, ఉమేష్ కెఆర్ బన్సాల్ నిర్మించిన ఈ మూవీ మార్చి 7న భారీ అంచనాల మధ్య థియేటర్స్‌లోకి వచ్చింది. థియేటర్‌లో విడుదలైన నెలరోజులకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం అయింది. ‘కింగ్‌స్టన్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ5 సొంతం చేసుకోగా.. ఏప్రిల్ 13వ తేదీ నుంచి స్ట్రీమింగ్‍కు రానుంది.






