'ధురంధర్ 2' నుండి నేర్చుకోవాల్సింది ఇదే

by Pulgam srinivas |

అంచనాలు తారాస్థాయిలో ఉన్న అలాంటి వ్యూహంతో ముందుకు వెళుతున్న ధురంధర్ 2 యూనిట్.

ధురంధర్ 2 నుండి నేర్చుకోవాల్సింది ఇదే
X

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కొంత కాలం క్రితం ధురంధర్ అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను కొల్లగొట్టి బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీల లిస్టులో చేరిపోయింది. ఈ సినిమాకు సంబంధించిన రెండవ భాగం మార్చి 19వ తేదీన విడుదల కానుంది. ఈ మూవీ బృందం ప్రణాళికలను చూసి అనేకమంది ఫిల్మ్ మేకర్స్ చాలా విషయాలు నేర్చుకోవాలి అని సాధారణ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.

అవి ఏంటి అనుకుంటున్నారా? ధురంధర్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది, రెండవ భాగంపై ఇండియా వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. దాంతో ఈ సినిమా టికెట్ ప్రైస్ భారీగా ఉంటుందని చాలామంది అనుకున్నారు. కానీ ఈ సినిమా టికెట్ ధరను తక్కువగా నిర్ణయించారు. అది మాత్రమే కాకుండా ఈ మూవీ టికెట్ ధరల పెంపు కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయకుండా సినిమా విడుదలకు దాదాపు 12 రోజుల ముందు ఈ మూవీ టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. దానితో ఈ చిత్రానికి సంబంధించిన టికెట్లు పెద్ద మొత్తంలో బుక్ అవుతున్నాయి.

ఇక మన తెలుగు సినిమా పరిశ్రమ విషయానికి వస్తే... స్టార్ హీరోలు నటించిన సినిమాలకు టికెట్ ధరలను పెంచాలనే ఉద్దేశంతో అందుకు సంబంధించిన జీవో రావాలని వేచి చూస్తూ, వేచి చూస్తూ సినిమా విడుదలకు కొన్ని గంటల ముందు టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాంతో విసిగి వేసారి టికెట్ బుకింగ్ చేసుకోని వారు కూడా ఉంటున్నారు. ధురంధర్ 2 మూవీని ఫాలో అయ్యి టికెట్ ధరల పెంపు కోసం ఎక్కువ రోజులు వేచి చూడకుండా సినిమా విడుదలకు చాలా రోజుల ముందు బుకింగ్స్ ఓపెన్ చేసినట్లయితే అద్భుతమైన వసూళ్లను రాబట్టవచ్చు అని, ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించకుండా ఉండొచ్చు అని సామాన్య జనం అభిప్రాయపడుతున్నారు.

Next Story