- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఫిష్ వెంకట్ ఫ్యామిలీకి సోను సూద్ చేసిన సాయం ఇదే !
టాలీవుడ్ స్టార్ నటుడు ఫిష్ వెంకట్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. లివర్ అలాగే కిడ్నీలు విఫలం కావడంతో ఫిష్ వెంకట్..

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ నటుడు ఫిష్ వెంకట్ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. లివర్ అలాగే కిడ్నీలు విఫలం కావడంతో ఫిష్ వెంకట్.. చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే మరణించారు. అయితే ఆయన ఆరోగ్యం బాగుపడాలంటే దాదాపు 50 లక్షలు రూపాయల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు ముందే తెలిపారు. అయితే అంత డబ్బు ఫిష్ వెంకట్ కుటుంబం పెట్టలేక.. అతని కోల్పోయింది.
ఇటు ఇండస్ట్రీ నుంచి కూడా ఎలాంటి సహాయం రాలేదు. ఇది ఇలా ఉండగా... గత నెలలో ఫిష్ వెంకట్ మరణించగా... అతని కుటుంబానికి నటుడు సోను సూద్ భారీ సహాయమే చేశారు. తన తండ్రి దశ దినకర్మకు లక్షన్నర రూపాయలు ఇచ్చారని ఫిష్ వెంకట్ కుమార్తె స్రవంతి వెల్లడించారు. అందుకే గ్రాండ్ గా ఆ కార్యక్రమం నిర్వహించామని వివరించారు.
అలాగే తమ ఇంటి నిర్మాణం బాధ్యత కూడా తానే తీసుకుంటానని.. సోనుసూద్ చెప్పినట్లు స్రవంతి స్పష్టం చేశారు. తన పర్సనల్ నెంబర్ కూడా తమకు ఇచ్చాడని వెల్లడించారు. ఇది ఇలా ఉండగా ఇటీవలే ఫిష్ వెంకట్ కుటుంబాన్ని సోను పరామర్శించిన సంగతి తెలిసిందే.






