- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Allu Arjun: నేను ఇలా ఉండటానికి కారణం వారే.. వేవ్స్ సమ్మిట్‌లో కీలక వ్యాఖ్యలు చేసిన అల్లు అర్జున్..
వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ ముంబై వేదికగా ఘనంగా ప్రారంభమైంది.

దిశ, సినిమా: వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ -వేవ్స్ ముంబై వేదికగా ఘనంగా ప్రారంభమైంది. భారతీయ సినిమాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం నాలుగు రోజుల పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ సదస్సును ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గురువారం (మే01) ప్రారంభించారు. అయితే 90కి పైగా దేశాల నుంచి పదివేల మందికి పైగా ప్రతినిధులు, 300కి పైగా కంపెనీలు, 350కి పైగా స్టార్ట్ అప్‌లు ఈ భారీ సదస్సులో పాల్గొని సందడి చేయనున్నారు. అలాగే బాలీవుడ్, టాలీవుడ్ సహా.. భారత సినీ ఇండస్ట్రీకి చెందిన అగ్రనటులు, పలువురు వ్యాపార దిగ్గజాలు, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు ఈ కార్యక్రమంలో భాగం కానున్నారు. ఇందులో పాల్గొన్న అల్లు అర్జున్(Allu Arjun) కీలక వ్యాఖ్యలు చేశారు. ఇందులో భాగంగా పుష్ప-2(Pushpa 2: The Rule) తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది.
ఈ సినిమా మీ జీవితం ఎలాంటి ప్రభావం చూపింది.. మీ లైఫ్ మారిందా అని అడగ్గా ‘‘అందరికీ నమస్కారం. నన్ను ఇక్కడికి పిలిచినందుకు ధన్యవాదాలు. ఈ వండల్‌ఫుల్ వేవ్స్ సమ్మిట్ నిర్వహించినందుకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు థ్యాంక్స్ చెబుతున్నాను. ఇలాంటి సమ్మిట్ ఉంటే బాగుండని చాలాకాలంగా అనుకుంటున్నా. ఎంటర్‌టైన్‌మెంట్ ఇండస్ట్రీలో ఉండటం సంతోషంగా అనిపిస్తుంది. చాలామందికి నా ఫేస్ తెలుసు. సౌత్ ఇండస్ట్రీలో మొట్టమొదటగా నేను సిక్స్ ప్యాక్ బాడీని సంపాదించుకున్నాను. అలా చేయడానికి కారణం నాతో పని వారితో ఒకరు నన్ను మోటివేట్ చేశారు. దానిని నేను చాలెంజ్‌గా తీసుకున్నాను. అయితే అందరికీ ఫిట్‌నెస్ అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా ఇండియన్ యాక్టర్స్‌కు. ఎందుకంటే వారు డ్యాన్స్, యాక్టింగ్, ఫైట్ వంటివి చేయాలి.
మీకు తెలియదు.. ఒక సినిమా ఎక్కడి నుంచి అయినా మొదలవుతోంది. కాబట్టి అన్నింటికి సిద్ధంగా ఉండాలి. నేను 20 ఏళ్లు ఉన్నప్పుడే డ్యాన్స్ చేయడం మొదలుపెట్టా. చాలా అనుభవాలు, ప్రమాదాలు ఎదుర్కొన్నాను. నిజంగా చెప్పాలంటే చాలా కష్టం. అయినప్పటికీ బిగ్ స్క్రీన్‌పై చూస్తుంటే బాగుంటుంది. నా 10వ సినిమా తర్వాత నాకు యాక్సిడెంట్ అయింది. భుజానికి దెబ్బతగలడంతో సర్జరీ చేశారు. 3 వారాలకు బయటకు వచ్చాను. 4వ వారంలో జిమ్‌లోకి వెళ్లాను. అయితే నాకు షూటింగ్ ఉండగా.. డాక్టర్లు మాత్రం 6 నెలలు రెస్ట్ తీసుకోమని అన్నారు. నా కెరీర్‌కు అదే ముఖ్యమైన సమయం. అయితే నా 20వ సినిమాకు ఫస్ట్ తెలుగు యాక్టర్‌గా నేషనల్ అవార్డు వచ్చింది. నా జీవితంలో నా చేతి విరిగిన సమయం బిగ్గెస్ట్ లో. అలాగే గిఫ్ట్ కూడా ఎందుకంటే అప్పుడే నాకు 7 అవార్డులు వచ్చాయి. కొన్ని యాక్సిడెంట్స్ మంచే చేస్తాయి. అయితే నేను ఇప్పుడు ఇలా ఉన్నా అంటే అది నా కుటుంబం వల్లే’’ అని చెప్పుకొచ్చారు.






