ఫిష్ వెంకట్ కెరీర్ బెస్ట్ సినిమాలు ఇవే

by velandi.Saikiran |

టాలీవుడ్ స్టార్ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) మృతి చెందారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఫిష్ వెంకట్

ఫిష్ వెంకట్ కెరీర్ బెస్ట్ సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : టాలీవుడ్ స్టార్ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat) మృతి చెందారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఫిష్ వెంకట్ మరణించినట్లు వార్త బయటకు వచ్చింది. కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతూ.. ఆసుపత్రిలోనే కన్నుమూశారు ఫిష్ వెంకట్. చందానగర్ లోని PRK ఆసుపత్రిలో... చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు ఫిష్ వెంకట్. దీంతో టాలీవుడ్ ( Tollywood) ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఇది ఇలా ఉండగా ఫిష్ వెంకట్ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఫేమస్ కావడం వెనుక జూనియర్ ఎన్టీఆర్ (NTR) మూవీ ఉంది. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన ఆది సినిమా తోనే ఫిష్ వెంకట్ కు గుర్తింపు వచ్చింది. ఈ సినిమాతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నాడు ఫిష్ వెంకట్.

ఆ తర్వాత ఇండస్ట్రీలో కామెడీ విలన్ గా రాణించాడు. ఈ నేపథ్యంలోనే బన్నీ, కింగ్, మిరపకాయ్, గబ్బర్ సింగ్, సర్దార్, డిజె టిల్లు, అత్తారింటికి దారేది, దిల్, కందిరీగ, అదుర్స్, ఢీ ఇలాంటి ఎన్నో సినిమాలు... చేసి సక్సెస్ అందుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటివరకు వందకు పైగా సినిమాల్లో నటించి మెప్పించాడు.

Next Story