- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
100 కోట్ల వచ్చిన సాటిస్ఫాక్షన్ లేదు.. ఆ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేసిన వివేక్ ఆత్రేయ
వివేక్ ఆత్రేయ మాట్లాడుతూ... ‘సరిపోదా శనివారం’ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే ఆ సినిమా విజయంతో రైటర్‌గా నాకు పూర్తి సంతృప్తి రాలేదుని ఈ దర్శకుడు చెప్పుకొచ్చాడు.

దిశ, వెబ్ డెస్క్: తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతిభ కలిగిన యువ దర్శకుల్లో వివేక్ ఆత్రేయ ఒకరు. ఇటీవల ఆయన తెరకెక్కించిన ‘సరిపోదా శనివారం’ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఇక త్వరలోనే ఆయన బాలయ్యతో ఒక సినిమాను చేయనున్నట్లు సమాచారం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వివేక్ ఆత్రేయ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన మాట్లాడుతూ, “నానితో చేసిన ‘సరిపోదా శనివారం’ సినిమా రూ.100 కోట్ల కలెక్షన్లు సాధించింది. అయితే ఆ సినిమా విజయంతో రైటర్‌గా నాకు పూర్తి సంతృప్తి రాలేదు. దానికంటే ‘అంటే సుందరానికి’ చిత్రంలోని రైటింగ్‌తోనే నేను ఎక్కువ సంతృప్తి పొందాను” అని తెలిపారు. అలాగే ‘సరిపోదా శనివారం’ సినిమా క్లైమాక్స్‌ను సమయానికి పూర్తిగా రాయలేకపోయానని, అదే సమయంలో ఇతర పనులు ఉండటంతో కొంతమంది రచయితల సహాయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. “ఒత్తిడిలో నేను సరిగా పని చేయలేను. డెడ్‌లైన్స్ అంటే నాకు అస్సలు నచ్చవు. ఒక నిర్దిష్ట సమయంలో పని పూర్తి చేయాలనే ఒత్తిడి ఉంటే, నేను పనిని ఫుల్ పర్ఫెక్ట్ గా చేయలేనని వివేక్ ఆత్రేయ స్పష్టం చేశారు.






